-ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి సమక్షంలో బోయారేవుల గ్రామంలో టిడిపిని వీడి వైఎస్సార్సీపీ లోకి 100 కుటుంబాల చేరికలు
-బోయారేవుల గ్రామంలో టిడిపి నుండి వైసీపీ లోకి 100 కుటుంబాల చేరిక
-వైసీపీలోకి ఊపు అందుకున్న చేరికలు
-డమ్మీ చేరికలతో బుడ్డా అరుభాటాలు
వెలుగోడు మండలంలోని బోయారేవుల గ్రామంలో గత 30 సంవత్సరాలుగా టిడిపిలో కొనసాగుతున్న బోయారేవుల మాజీ సర్పంచులు పోతుల రమణారెడ్డి,ఆయన సతీమణి పోతుల సరస్వతి అధ్వర్యంలో 100 కుటుంబాలు ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మంగళవారం నాడు చేరడం జరిగింది.గ్రామంలో 100 కుటుంబాలు టిడిపిని వీడిన వారికి ఎమ్మెల్యే శిల్పా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువాలు వేసి సాధారంగా పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.దీనితో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరికలు ఉపు అందుకున్నాయి అదే విధంగా మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి డమ్మీ చేరికలతో ఆర్భాటాలు చేస్తున్నారని ఆరోపించారు.
ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ గత 30సంవత్సరాలుగా తెలుగు దేశం పార్టీలో ఏమి అభివృద్ది కనిపించలేదని ఈ గత 5 సంవత్సరాలలో జగనన్న సంక్షేమ పథకాలు అద్భుతంగా ఉన్నాయని అందుకే వైఎస్ఆర్ పార్టీలో చేరామన్నారు.ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తామన్నారు ఈ సంక్షేమ పథకాలు కొనసాగాలంటే జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి కావాలన్నారు.ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో నా స్వంత డబ్బులతో రైతులకు నీరును అందించడం నిరుపేదలు సహాయం అందించడం జరిగింది అన్నారు అంతే కాక ఎన్నో ఏళ్లగా అభివ్రుద్దికి నోచుకోని మసీదులకు, వెల్పనూరు వెలుగోడు గ్రామాలలో నూతన వైద్య శాలలను ఆరు కోట్లతో నిర్మించచడం సీసీ రోడ్లు బిటి రోడ్లు డ్రైనేజ్ లు నిర్మించడం జరిగిందన్నారు ఇది అభివ్రుద్ది కాదా అని ప్రతి పక్ష నాయకులక కళ్ళకి కనిపించవా అని విమర్శించారు.ఇదే గ్రామంలో గతంలో మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి గ్రామానికి మొత్తం 750 కుటుంబాలు ఉంటే 500ల కుటుంబాలు టిడిపిలో చేరినట్టు తప్పుడు రాతలపై శిల్పా మండి పడ్డారు.