SAKSHITHA NEWS

కడప: వైకాపా చేసే ప్రతి తప్పును తెదేపా అధినేత చంద్రబాబుపై నెట్టేస్తున్నారని ఆయన సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. పింఛన్ల విషయాన్ని కుట్రపూరితంగా ఆయనకు ఆపాదిస్తున్నారని మండిపడ్డారు..

వైకాపా రాక్షస పాలనలో చంపడం, హింసించడం అలవాటుగా మారిందని విమర్శించారు. ‘నిజం గెలవాలి’ యాత్రలో భాగంగా ఆమె కడపలో పర్యటించారు. చంద్రబాబు అరెస్టుతో మనస్తాపం చెంది మరణించిన చెండ్రాయుడు కుటుంబాన్ని పరామర్శించారు. తెదేపా అధికారంలోకి వస్తేనే రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుందని అన్నారు..