పర్వత శిఖరాలు అధిరోహించిన భౌరంపేట్ యువకుడిని సత్కరించి ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ,…
*సాక్షిత : *కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ లోని భౌరంపేట్ గ్రామ యువకుడు పల్పునూరి తులసిరెడ్డి ప్రపచంలోని ఎత్తయిన పర్వత శిఖరాలను అధిరోహించడమే లక్ష్యంగా పెట్టుకొని ఈ నెల 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఐరోపా ఖండంలోని 5642 మీటర్ల ఎత్తయిన మౌంట్ ఎల్బర్స్ శిఖరాన్ని అధిరోహించి జాతీయ జెండాను ఘనంగా ఎగురవేసారు. ఈ సందర్భంగా తులసి రెడ్డి మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని మర్యాదపూర్వకంగా కలిసి తాను అధిరోహించిన పర్వత శిఖరాల గురించి వివరించారు.
వారిని శాలువాతో సన్మానించి అభినందనలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో కూడా మరిన్ని శిఖరాలను అధిరోహించి యువతకు ఆదర్శంగా నిలవాలని తెలిపారు. మైనస్ 40 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఎత్తయిన పర్వతాలను అధిరోహించాలంటే ప్రాణాలను సైతం ఫణంగా పెట్టడమే. దాని కోసం ఎన్నో రోజుల కఠిన శిక్షణ పొంది ఉండాలన్నారు. తులసిరెడ్డి 2016లో తన గ్రాడ్యుయేషన్ అనంతరం పర్వత శిఖరాలను అధిరోహించాలని ఆసక్తితో అప్పటి నుండి శిక్షణ పొంది మొదటి సారిగా 2022 లో ఆసియా ఖండం, భారతదేశం లోని లడఖ్ లో 3610 మీటర్ల ఎత్తయిన స్టాక్ కాంగ్రీ పర్వతాన్ని అధిరోహించారు. అదే స్ఫూర్తితో 2023 సంవత్సరంలో కాశ్మీర్ లోని 4190 మీటర్ల ఎత్తయిన గగ్రేట్ లేక్స్ ను మరియు ఆఫ్రికా ఖండంలో 5859 మీటర్ల ఎత్తయిన ఖిల్లిమంజారో పర్వతాన్ని అధిరోహించి తన సత్తా చాటారు. ఈ కార్యక్రమంలో నాయకులు విష్ణు వర్ధన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు…