
కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ కమిటీ హాల్లో భారతరత్న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఎస్సీ సెల్ అధ్యక్షులు జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత, అట్టడుగు వర్గాల భాగ్యవిధాత యావత్ జాతికి నిత్య స్పూర్తి ప్రధాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఇవే మా ఘన నివాళులు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నరసింహ మాస్టర్, రామ్ రెడ్డి, సంజీవరెడ్డి, రవీందర్ రెడ్డి, సంజీవ, మల్లికార్జున్, శ్రీనివాస్ యాదవ్, యోగి రాజు, అశోక్, యేసు రత్నం, శివ, కరుణాకర్, బిక్షపతి, యాది, విఠ్ఠల్, సత్యమ్మ, వెంకటమ్మ, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
