నవభారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బిఆర్. అంబేద్కర్ 125 అడుగుల విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ప్రజలు పాల్గొనేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి.
జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్
ఖమ్మం బ్యూరో చీఫ్, ఏప్రిల్10,(సాక్షిత న్యూస్))
నవభారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బిఆర్. అంబేద్కర్ 125 అడుగుల విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ప్రజలు పాల్గొనేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు. ఐడిఓసి లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి హైదరాబాదులో 125 అడుగుల బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి జన సమీకరణ ఏర్పాట్లపై నియోజకవర్గ ఇంచార్జి అధికారులు, మున్సిపల్ కమిషనర్లులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డా. బిఆర్. అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14 రోజున హైదరాబాదులో నవభారత నిర్మాత భారతరత్న అంబేద్కర్ విగ్రహవిష్కరణ కార్యక్రమంలో నియోజవర్గం నుండి 300 మంది పాల్గొనేలా మండలాల వారీగా జన సమీకరణ చర్యలు చేపట్టాలని అన్నారు. నియోజకవర్గానికి ఆరు బస్సులను పాటు చేసి ప్రతి బస్సు లో ఒక లైజన్ అధికారికి కార్యక్రమంలో పాల్గొని తిరిగి మండల కేంద్రాలకు చేరేవరకు బాధ్యతలు అప్పగించాలన్నారు. ఎంపీడీవో, తహసిల్దార్ స్థాయి అధికారులను లైజన్ అధికారులుగా నియమించాలని అన్నారు. కార్యక్రమానికి వచ్చే వారికి బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ భోజనం, వాటర్ బాటిల్స్ ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమం కోసం తీసుకెళ్లే 30 వాహనాలకు ఫ్లెక్సీలు అమర్చాలని, ఎస్కార్ట్ సిబ్బంది ఉండాలన్నారు
.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, మున్సిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, అసిస్టెంట్ శిక్షణ కలెక్టర్ రాధికా గుప్తా, పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ వేణు మనోహర్, జెడ్పి సీఈఓ వి.వి. అప్పారావు, డిఆర్డీవో విద్యాచందన, ఇడి ఎస్సి కార్పొరేషన్ శ్రీనివాసరావు, డిప్యూటీ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ కె. సత్యనారాయణ,
అర్టిఓ టి. కిషన్ రావు, ఏసిపి ప్రసన్న కుమార్, జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి శ్రీరామ్, మున్సిపల్ కమిషనర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.