భగవత్స్వరూప మహిమాన్మితురాలు మహిళ

Spread the love

భగవత్స్వరూప మహిమాన్మితురాలు మహిళ: వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్”

ఈరోజు (08-03-2023) బుధవారం నాడు వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” వికారాబాద్ పట్టణంలో BRS పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన 111 వ అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు.

వికారాబాద్ జిల్లా మరియు నియోజకవర్గ మహిళలకు “111వ అంతర్జాతీయ మహిళా దినోత్సవం” శుభాకాంక్షలు తెలియజేశారు.

ముందుగా మొక్కలు నాటి, బతుకమ్మ ఆడారు మహిళలందరూ ఆనందోత్సవాల నడుమ అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.

మానవ జీవితానికి పురుడు పోసిన మహిళామూర్తికి… సమాజం ఎప్పుడు రుణపడి ఉండాలని, మగవారి జీవితంలో ప్రతి దశలో మహిళ భగవత్ స్వరూపినిగా జీవితంలో తోడు ఉంటుందన్నారు.

నేటి ఆధునిక సమాజంలో కూడా ఆడపిల్ల పుట్టిందనే వివక్షత అక్కడక్కడ కొనసాగడం చాలా బాధాకరమని, సమాజం చైతన్యవంతమై, అన్ని రంగాలలో ముందుంటున్నటువంటి మహిళలకు ప్రాధాన్యత కల్పించాలన్నారు.

అనంతరం BRS పార్టీ జిల్లా కార్యాలయం ఆవరణలో హోలీ వేడుకలు జరుపుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి, సబితా ఆనంద్ ఫౌండేషన్ చైర్ పర్సన్ డాక్టర్ మెతుకు సబితా ఆనంద్ , మహిళ ప్రజాప్రతినిధులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page