SAKSHITHA NEWS

నిజామాబాద్ లో భద్రాచల ముత్యాల తలంబ్రాల పంపిణి
గజ్వేల్ రామకోటి భక్త సమాజం ధార్మిక సంస్థ

సాక్షిత సిద్దిపేట జిల్లా:
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గజ్వేల్ లోని శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ 25సంవత్సరాల నుండి చేస్తున్న అధ్యాత్మిక సేవలకు గాను భద్రాచల దేవస్థానం ఎ సంస్థకు ఇవ్వని 100కిలోల ముత్యాల తలంబ్రాలు రామకోటి సంస్థకు అందించారు. నిజామాబాద్ లోని కోటగల్లి హనుమాన్ మందిరంలో ముత్యాల తలంబ్రాల పంపిణి చేశారు. 2గంటల పాటు భక్తులచే రామనామ స్మరణ చేయించి, తలంబ్రాల విశిష్టత తెలియజేసి అనంతరం సంస్థ వ్యవస్థాపక, అధ్యకులు అధ్యక్షులు, భక్తిరత్న, కళారత్న, సేవారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు అందజేశారు.

ఈ సందర్బంగా మాట్లాడుతూ భద్రాచల సీతారాముల కళ్యాణానికి గోటితో ఒడ్లు ఓలిచి తలంబ్రాలుగా తయారుచేసి భద్రాచలం అందించిన ఘనత ఈ నిజామాబాద్ భక్తులది అని అన్నారు. అందుకే సాక్షాత్తు భద్రాచల తలంబ్రాలు అందించడం జరిగిందన్నారు. అంతరం భక్తులు మాట్లాడుతూ మేము భద్రాచలం పోలేక పోయిన కూడ మాకు భద్రాచల ముత్యాల తలంబ్రాలు అందడం అన్నో జన్మల పుణ్యపమో అన్నారు. రామకోటి రామరాజు చేతుల మీదుగా మాకు అందించడం అయన రామభక్తికి నిదర్శనం అన్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు విష్ణు పంతులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

WhatsApp Image 2024 08 21 at 17.34.10

SAKSHITHA NEWS