Before service program along with law and order
శాంతిభద్రత లతో పాటు సేవా కార్యక్రమంలో ముందుంటు నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్న ఉరుకొండ ఎస్సై లక్ష్మణ్
నవంబర్ 24 సాక్షిత ప్రతినిధి.
జడ్చర్ల నియోజకవర్గంలోని మాచారం గ్రామం లో మానవ సేవే మాధవ సేవ. అంటూ తన పుట్టి పెరిగిన ఊర్లో నిరుపేదలకు నేనున్నాను అంటూ సేవలు చేస్తున్న ఊరుకొండ ఎస్సై లక్ష్మణ్. మాచారము గ్రామంలో చనిపోయిన పానుగంటి రామస్వామి. లక్ష్మమ్మ. చిన్న ఉషయ్య. మహమ్మద్ పాష. కుమ్మరి చంద్రయ్య. నిరుపేద రాయపల్లి లక్ష్మయ్య. కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందించడం జరిగింది.
మాచర్ల గ్రామంలో చనిపోయిన కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఎస్సై లక్ష్మణ్ కి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎస్సై లక్ష్మణ్ మాచారం గ్రామంలో చాలామంది నిరుపేద విద్యార్థులకు పై చదువుల కోసం విద్యార్థుల చదువుల కోసం సహాయం చేశారని. మాచారం గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారని.
కరోనా కష్టకాలంలో నిరుపేదలకు కావాల్సిన నిత్య సరోసారుకుల పంపిణీ చేయడం జరిగిందని. అనాధ పిల్లలకు హాస్టల్ పిల్లలకు ఉచిత పాఠ్యపుస్తకాలు దుప్పట్ల పంపిణి చేయడం. మాచారం గ్రామంలో ఎవరైనా చనిపోతే అట్టి కుటుంబ సభ్యులకు దహన సంస్కారాల కోసం తక్షణ ఆర్థిక సాయం చేయడం.
అనాధ పిల్లలను స్కూల్ లలో చేర్పించి చదువు. వైద్య ఖర్చులకోసం సహాయం చేయడం గొప్ప వ్యక్తి ఎస్సై లక్ష్మణ్ అని వారు అన్నారు. మానవసేవయే మాధవసేవ అంటే అర్థం తెలియని వారు ఉండరు. మానవునికి సేవ చేస్తే దేవుడికి సేవ చేసినట్లే. అంటున్నారు ఊరుకొండ ఎస్సై లక్ష్మణ్.
సేవ అనే రెండు అక్షరాలు పదం. చూడడానికి చాలా చిన్నదిగా అనిపించిన సేవ చేయడం ఆచరిస్తే అది చాలా గొప్పది. సేవ చేయాలనే తపన ఉండాలే కాని ఎవరైనా ఏ రూపంలోనైనా సేవ చేయవచ్చు.కానీ సేవ చేయడమే నాకెంతో ఇష్టం అంటున్నారు.
ప్రస్తుతం ఊరుకొండ ఎస్ఐగా నిధులు నిర్వహిస్తున్న లక్ష్మణ్. తన సొంత గ్రామమైన మాచారం లో చనిపోయిన కుటుంబ సభ్యులకు. నిరుపేద కుటుంబానికి సహాయం చేయడం జరిగిందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో రాందాస్. జగన్ రెడ్డి. మల్లేష్. శంకర్ నాయక్. రాజు. లక్ష్మయ్య. వెంకటయ్య. మైబు. సత్తయ్య కృష్ణయ్య యాద య్య కుమ్మరి యాదయ్య కిషన్ వెంకటేష్ జంగిలయ్య సురేష్ తదితరులు పాల్గొన్నారు