SAKSHITHA NEWS

చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తి శ్రీ నగర్ కాలనీ లో గల రేగుల కుంట చెరువు సుందరికరణలో భాగంగా sales Force IT కంపెనీ వారి CSR ఫండ్స్ ద్వారా స్వచ్ఛందంగా రూ. 1 కోటి 50 లక్షల రూపాయల అంచనావ్యయం తో చేపడుతున్న సుందరికరణ పనులను మరియు అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ .

ఈ సందర్బంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ రేగుల కుంట చెరువు కు దశ దిశ మారినది అని, ఎన్నో ఏండ్ల సమస్య నేటి తో తిరునని, శాశ్వత పరిష్కారం దిశగా చెరువును అభివృద్ధి చేపట్టడం జరిగినది అని, మురికి కూపంలాంటి చెరువు స్వచ్చమైన మంచి నీరు లాంటి చేరువుగా తీర్చిదిద్దాడమే ధ్యేయం అని ఎమ్మెల్యే గాంధీ పేర్కొన్నారు.sales Force IT కంపెనీ వారి CSR ఫండ్స్ ద్వారా సుందరికరణ చేపట్టుటకు ముందుకు రావడం చాలా అభినదించదగ్గ విషయం అని, సమాజ హితం ,సమాజ సేవ చేయడం కోసం ముందుకు రావడం చాలా గర్వించదగ్గ విషయ అని, సాఫ్ట్ వెర్ సంస్థ ప్రతినిధులను ప్రత్యేకంగా అభినదిస్తున్నాను అని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు. చెరువు సుందరికరణ, సంరక్షణ,అభివృద్ధి పనులు త్వరితగతిన చేపట్టాలని, పనులలో వేగం పెంచాలని, అదేవిధంగా చెరువు సుందరికరణ లో భాగంగా చెరువు కట్ట పటిష్టం పరిచేలా పునరుద్ధరణ చేపడుతున్నామని , మురుగు నీరు చెరువు లో కలవకుండా ప్రత్యేకంగా చెరువు చుట్టూ నిర్మించే మురుగు నీటి కాల్వ (UGD) నిర్మాణం మరియు అలుగు మరమ్మత్తులు, చెరువు కట్ట బలోపేతం ,పునరుద్దరణ పనులు, వాకింగ్ ట్రాక్ వంటి పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు. చెరువు సంరక్షణ లో భాగంగా చెరువు చుట్టూ ఫెన్సిగ్ (కంచె) నిర్మాణం మరియు చెరువు యొక్క అలుగు నిర్మాణము మరియు చెరువు సుందరికరణ పనులు చేపడుతున్నాం అని ,చెరువు సుందరికరణ మరియు అభివృద్ధి పనులు నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని, త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని అధికారులకు తెలియచేశారు అదేవిధంగా ప్రణాళిక తో పనులు చేపట్టాలని ఎమ్మెల్యే గాంధీ పేర్కొన్నారు .

అదేవిధంగా చెరువులను సంరక్షణిచడమే ధ్యేయంగా పనిచేస్తున్నాం అని , అదేవిధంగా మెడికుంట చెరువును సుందరవనం గా ,శోభితవర్ణం గా తీర్చిదిద్దుతామని, అదేవిదంగా చెరువు ల చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి చెరువు ల ను సంరక్షిస్తామని ఎమ్మెల్యే గాంధీ పేర్కొన్నారు .చెరువు ల వాకింగ్ ట్రాక్ నిర్మాణం గూర్చి అధికారులకు పలు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగినది .త్వరిత గతిన వాకింగ్ ట్రాక్ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు . చెరువు అపరిశుభ్రం వలన పేరుకుపోయిన గుర్రపు డెక్క వలన దోమల పెరగడం వలన స్థానికులకు ఏర్పడుతున్న ఇబ్బందులను ,అనారోగ్యాలకు గురవడం స్థానికులు పలుమార్లు ఎమ్మెల్యే కి పిర్యాదు చేయడం వలన దీనికి స్పందించిన ఎమ్మెల్యే స్థానికులు పడుతున్న ఇబ్బందులను తొలగించడానికి చెరువును దత్తత తీసుకొని సొంత నిధులతో చెరువును శుభ్రపరిచి సుందరీకరణ చేసిన సంగతి విదితమే .అదేవిధంగా ప్రజలకు చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తామని చెప్పడం జరిగినది , తామర పువ్వులను పెంచి కలుషితం కాకుండా చెరువును సుందరీకరిస్తామని ఎమ్మెల్యే గాంధీ చెప్పటం జరిగినది .చెరువులను సుందరీకరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ,చెరువులు కలుషితం కాకుండా మరియు కబ్జాలకు గురికాకుండా చెరువులను పూర్తి స్థాయి లోసంరక్షిస్తామని , చెరువు చుట్టూ పెన్సింగ్ ఏర్పాటు చేసి వాకింగ్ ట్రాక్ ను ఏర్పాటు చేసి ,ప్రజలకు చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తామని,అలాగే నియోజకవర్గం లోని అన్ని చెరువులను పూర్తి స్థాయిలో సుందరీకరిస్తామని ఎమ్మెల్యే చెప్పటం జరిగినది చెరువుల పరిరక్షణకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామని ,మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరిస్తామని ఎమ్మెల్యే గాంధీ చెప్పడం జరిగింది .

ఈ కార్యక్రమంలో Sales Force కంపెనీ ప్రతినిధులు చైతన్య తాళ్లూరి, చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు నాయి నేని చంద్రకాంత్ రావు, పూర్ణచందర్ ,సీతారామయ్య, చంద్రశేఖర్ ,బాబు మోహన్ మల్లేష్, ప్రశాంత్, సందీప్ రెడ్డి, అవినాష్ రెడ్డి, కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు
మరియు కాలనీ వాసులు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2023 12 18 at 4.11.52 PM

SAKSHITHA NEWS