హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని ఈర్ల చెరువు సుందరికరణ

Spread the love

హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని ఈర్ల చెరువు సుందరికరణ, సంరక్షణ,అభివృద్ధి పనులలో భాగంగా రూ. 7 కోట్ల 73 లక్షల రూపాయల తో నూతనంగా చేపడుతున్న చెరువులో మురుగు నీరు కలవకుండా చేపడుతున్న మురుగు నీటి మల్లింపు కాల్వ నిర్మాణం పనులకు మరియు బతుకమ్మ ఘాట్ నిర్మాణము పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని ఈర్ల చెరువు సుందరికరణ, సంరక్షణ,అభివృద్ధి పనులలో భాగంగా రూ. 7 కోట్ల 41 లక్షల రూపాయల తో నూతనంగా చేపడుతున్న చెరువులో మురుగు నీరు కలవకుండా చేపడుతున్న మురుగు నీటి మల్లింపు కాల్వ నిర్మాణం పనులకు మరియు రూ. 32 లక్షల రూపాయల అంచనావ్యయంతో చేపడుతున్న బతుకమ్మ ఘాట్ నిర్మాణము పనులకు కార్పొరేటర్లు శ్రీమతి పూజిత జగదీశ్వర్ గౌడ్ , జగదీశ్వర్ గౌడ్ ఇరిగేషన్ అధికారులతో కలిసి శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని ఈర్ల చెరువు సుందరికరణ, సంరక్షణ,అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుంది అని, చెరువు లో కలుషిత నీరు కలవకుండా చేపడుతున్న డ్రైనేజి వ్యవస్థ మల్లింపు పనులకు శంకుస్థాపన చేసుకువడం జరిగినది అని, వైశాలి నగర్ నుండి ఈర్ల చెరువు అలుగు వరకు డ్రైనేజి వ్యవస్థ మల్లింపు కాల్వ నిర్మాణం పనులకు వేగం పెంచాలని,పనులు నాణ్యత ప్రమాణాల తో చేపెట్టాలని,నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు, చుట్టుపక్కల కాలనీల నుండి వచ్చే మురుగు నీరు చెరువులో కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ,చెరువు చుట్టుపక్కల నివసిస్తున్న కాలనీ వాసులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడలని, మురుగు నీటి కాల్వ పై స్లాబ్ లు వేయాలని,ప్రజల ఇబ్బందులను పరిగణలోకి తీసుకుని పనులు వేగవంతం చేయాలని, పనులు నాణ్యత ప్రమాణాల తో చేపట్టాలని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

అదేవిధంగా చెరువు సుందరికరణ లో భాగంగా చెరువు కట్ట పటిష్టం పరిచేలా పునరుద్ధరణ , మురుగు నీరు చెరువు లో కలవకుండా ప్రత్యేకంగా చెరువు చుట్టూ నిర్మించే మురుగు నీటి కాల్వ (UGD) నిర్మాణం మరియు అలుగు మరమ్మత్తులు, చెరువు కట్ట బలోపేతం ,పునరుద్దరణ పనులు, వాకింగ్ ట్రాక్ వంటి పనులు చేపడుతామని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు చెరువు సంరక్షణ లో భాగంగా చెరువు చుట్టూ ఫెన్సిగ్ (కంచె) నిర్మాణం మరియు చెరువు యొక్క అలుగు నిర్మాణము మరియు చెరువు సుందరికరణ పనులు చేపడుతున్నాం అని ,చెరువు సుందరికరణ మరియు అభివృద్ధి పనులు నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని, త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని అధికారులకు తెలియచేశారు అదేవిధంగా ప్రణాళిక తో పనులు చేపట్టాలని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు .అదేవిధంగా చెరువులను సంరక్షణిచడమే ధ్యేయంగా పనిచేస్తున్నాం అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. అదేవిధంగా మెడికుంట చెరువును సుందరవనం గా ,శోభితవర్ణం గా తీర్చిదిద్దుతామని, అదేవిదంగా చెరువు ల చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి చెరువు ల ను సంరక్షిస్తామని ఎమ్మెల్యే గాంధీ పేర్కొన్నారు .చెరువు ల వాకింగ్ ట్రాక్ నిర్మాణం గూర్చి అధికారులకు పలు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగినది .త్వరిత గతిన వాకింగ్ ట్రాక్ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు . చెరువు అపరిశుభ్రం వలన పేరుకుపోయిన గుర్రపు డెక్క వలన దోమల పెరగడం వలన స్థానికులకు ఏర్పడుతున్న ఇబ్బందులను ,అనారోగ్యాలకు గురవడం స్థానికులు పలుమార్లు ఎమ్మెల్యే కి పిర్యాదు చేయడం వలన దీనికి స్పందించిన ఎమ్మెల్యే స్థానికులు పడుతున్న ఇబ్బందులను తొలగించడానికి చెరువును దత్తత తీసుకొని సొంత నిధులతో చెరువును శుభ్రపరిచి సుందరీకరణ చేసిన సంగతి విదితమే .అదేవిధంగా ప్రజలకు చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తామని చెప్పడం జరిగినది , తామర పువ్వులను పెంచి కలుషితం కాకుండా చెరువును సుందరీకరిస్తామని ఎమ్మెల్యే గాంధీ చెప్పటం జరిగినది .చెరువులను సుందరీకరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ,చెరువులు కలుషితం కాకుండా మరియు కబ్జాలకు గురికాకుండా చెరువులను పూర్తి స్థాయి లోసంరక్షిస్తామని , చెరువు చుట్టూ పెన్సింగ్ ఏర్పాటు చేసి వాకింగ్ ట్రాక్ ను ఏర్పాటు చేసి ,ప్రజలకు చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తామని,అలాగే నియోజకవర్గం లోని అన్ని చెరువులను పూర్తి స్థాయిలో సుందరీకరిస్తామని ఎమ్మెల్యే చెప్పటం జరిగినది చెరువుల పరిరక్షణకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామని ,మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరిస్తామని ప్రభుత్వ విప్ గాంధీ చెప్పడం జరిగింది .

మరియు రూ. 32 లక్షల రూపాయల అంచనావ్యయం తో చేపడుతున్న బతుకమ్మ ఘాట్ నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది అని, బతుకమ్మ ఘాట్ ను బతుకమ్మ పండుగ లోపు పనులు పూర్తి చేయాలని, బతుకమ్మ వేడుకల్లో భాగంగా మహిళ సోదరిమణులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని , అన్ని రకాల మౌలిక వసతులు కలిపించాలని ,సకల హంగులతో నిర్మించాలని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు.

ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ అధికారులు DE నళిని , AE పావని, మాజీ కౌన్సిలర్లు, మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,ఉద్యమకారులు,బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, అభిమానులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page