SAKSHITHA NEWS

WhatsApp Image 2023 08 25 at 5.30.46 PM

కుల వృత్తులకు పునరుజ్జీవనం బీసీబంధు

శేరిలింగంపల్లి నియోజకవర్గంలో బీసీ బందు పథకం ద్వారా మంజూరైన 300 మంది లబ్ధిదారులకు 3 కోట్ల రూపాయల విలువైన ఆర్థిక సహాయం ను చెక్కుల రూపేణా అందచేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

సబ్బండ వర్గాల అభివృద్దే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం

బీసీ బంధు నిరంతర ప్రక్రియ: ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని BC,MBC ల చేతి వృత్తిదారులకు లక్ష రూపాయలు ఆర్థిక సాయం ను ఈ రోజు మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గౌరవ రంగారెడ్డి జిల్లా బీసీ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీమతి విమల దేవి , అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీమతి నీరజ రెడ్డి అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ రమేశ్ , కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్ , జగదీశ్వర్ గౌడ్ , దొడ్ల వెంకటేష్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్ , శ్రీ నార్నె శ్రీనివాసరావు ,శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి , శ్రీమతి రోజాదేవి రంగరావు కలిసి 300 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బీసీబంధు ద్వారా కుల వృత్తులకు పునర్జీవనం చేసారాని, కూనరిల్లిన కులవృత్తిదారులకు ఆసరాగా ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద మనసుతో బీసీ బంధు పథకాన్ని ప్రవేశపెట్టినట్లు, బీసీ బంధు నిరంతర ప్రక్రియ అని, బీసీల ఆర్థిక స్వాలంబనే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది అని, ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు.పూర్తి పారదర్శకతతో లబ్ధిదారుల ఎంపిక జరిగినది అని,ప్రతి పైసా ను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోండి,ఆర్థిక స్వాలంబన పొందండి,దేశంలోని మొట్టమొదటిసారిగా బీసీల ఆర్థిక స్వావలంబన, కులవృత్తుల పరిరక్షణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీ బందు పథకం ప్రవేశపెట్టారని, ఎంపికైన ప్రతి లబ్ధిదారునికి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందిస్తూ వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నామని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు.ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు పదివేల రూపాయల రుణం కోసం బ్యాంకుల చుట్టూ పడిగాడ్పులు కాస్తూ, గ్యారంటీల కోసం ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల చుట్టూ తిరిగే పరిస్థితులు ఉండేవన్నారు. నేడు సీఎం కేసీఆర్ నాయకత్వంలో మొట్టమొదటిసారి కుల వృత్తుల అభివృద్ధి కోసం ఎలాంటి హామీ లేకుండా తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా లక్ష రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నామని తెలిపారు. ప్రతి పైసా సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని ప్రభుత్వ విప్ గాంధీ అభిలాషించారు మొదటి విడతగా 300 మందికి చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. మిగతా వారికి విడతల వారీగా ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందని ప్రభుత్వ విప్ గాంధీ తెలిపారు.

ఇల్లు లేని నిరుపేదల కోసం సొంత ఇంటి స్థలం ఉన్నవారికి ప్రభుత్వం గృహలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టిందని, అతి త్వరలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు.
మైనారిటీ బంధు ద్వారా అర్హులైన వారికి అందచేయడం జరుగుతుంది అని,

ముఖ్యమంత్రి సహాయ నిధి, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, దళిత బంధు తదితర పథకాల ద్వారా నియోజకవర్గ వ్యాప్తంగా అర్హులందరికీ లబ్ధి చేకూరుస్తున్నామని ప్రభుత్వ విప్ గాంధీ గారు తెలిపారు.

శేరిలింగంపల్లి నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధికి ప్రతీకగా నిలుస్తోందని దేశంలోనే మొట్టమొదటి సారిగా సబ్బండ వర్గాల సంక్షేమం కోసం వినూత్న పథకాలను ప్రవేశపెడుతున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందని తెలిపారు. బీసీ బందు పథకం కుల వృత్తుల పరిరక్షణలో నూతన శకానికి శ్రీకారం చుట్టబోతోందని తెలిపారు. ప్రభుత్వం అందించిన ప్రతి పైసాను రెట్టింపు చేయాలని ప్రభుత్వ విప్ గాంధీ గారు కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తున్నామని, పూర్తి పారదర్శకతతో లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నామని ప్రభుత్వ విప్ గాంధీ గారు తెలియచేసారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు , బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు, వార్డ్ మెంబెర్లు, ఏరియా కమిటీ ప్రతినిధులు,ఉద్యమకారులు ,బీఆర్ఎస్ పార్టీ అనుబంధాల సంఘాల ప్రతిధులు, మరియు కాలనీ వాసులు లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS