Bapatla District SP Vakul Jindal inaugurated the District SP Camp Office
బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం
జిల్లా ఎస్పీ క్యాంప్ కార్యాలయాన్ని ప్రారంభించిన బాపట్ల జిల్లా ఎస్పీవకుల్ జిందాల్
సాక్షిత : *రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల విభజన చేసిన అనంతరం బాపట్ల జిల్లాకు మొట్టమొదటి ఎస్పీగా విచ్చేసిన వకుల్ జిందాల్ కి క్యాంప్ కార్యాలయంగా బాపట్ల అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలోని ఉన్న భవనాన్ని కేటాయించడం జరిగింది. సదరు భవనాన్ని ఎస్పీ కార్యాలయానికి నివాస భవనానికి తగిన విధంగా పునర్ నిర్మాణం చేసి, దానిలోని ఎస్పీ చాంబర్ ను, సమావేశపు హాలును గురువారం బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వేదమంత్రాల నడుమ సంప్రదాయబద్దంగా ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన బాపట్ల జిల్లాలో ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి, జిల్లాలో శాంతి భద్రతలు పరిరక్షించడానికి పోలీస్ శాఖకు అవసరమైన కనీస సౌకర్యాలను ఒకదాని తరువాత మరొకటిగా కల్పిస్తున్నామన్నారు.
అనంతరం జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయం వద్ద జిల్లా పోలీస్ అధికారులకు, డిపిఓ అధికారులు సిబ్బందికి ప్రత్యేకంగా విందు భోజనాలు ఏర్పాటు చేసినారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ పి.మహేష్, బాపట్ల సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ ఏ.శ్రీనివాసరావు, చీరాల సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ పి.శ్రీకాంత్, రేపల్లె సబ్ డివిజినల్ పోలీస్ ఆఫీసర్ టి.మురళి కృష్ణ, ఏఆర్ డీఎస్పీ ఎం.డి.హెచ్. ప్రేమ్ కుమార్, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ఏ.శ్రీనివాస్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ ఎం.మురళి కృష్ణ, అడ్మిన్ ఆర్ఐ ఎల్.మన్మథ రావు, వెల్ఫేయిర్ ఆర్ఐ బి.శ్రీకాంత్ నాయక్, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.