SAKSHITHA NEWS

సాక్షిత : *బాపట్ల జిల్లా పోలీస్ అధికారులతో నేర సమీక్షా సమావేశం నిర్వహించిన బాపట్ల జిల్లా ఎస్పీ …
అత్యవసర కాల్స్ కు తక్షణం స్పందించాలి, లేకుంటే శాఖపరమైన చర్యలు తీసుకుంటాము.
పాత నేరస్తుల కదలికలపై నిఘా ఉంచాలి..
బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే వారి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి..
సామర్థ్యానికి మించి ఎక్కువ మందితో ప్రయాణిస్తున్న వాహనాలపై చర్యలు తీసుకోవాలి…

జిల్లా ఎస్పి వకుల్ జిందాల్…

సామర్థ్యానికి మించి ఎక్కువ మందితో ప్రయాణిస్తున్న వాహనాలపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పి వకుల్ జిందాల్ పోలీస్ అధికారులకు సూచించారు. మంగళవారం బాపట్ల జిల్లా ఎస్పీ క్యాంప్ కార్యాలయ సమావేశ హాలు నందు జిల్లా పోలీస్ అధికారులతో నెలవారీ నేర సమీక్షా సమావేశంను ఎస్పీ నిర్వహించారు. ఈ నేర సమీక్షా సమావేశంలో స్పందన పిటిషన్లు, పి వో సి ఎస్ ఓ కేసులు, గ్రేవ్ కేసులు, ప్రాపర్టీ కేసులు, చీటింగ్ కేసులు, 174 Cr.PC కేసులు, మిస్సింగ్ కేసులు, సర్కిల్ క్రైమ్ పార్టీల పనితీరు, గంజాయి, నాటుసారా ల కట్టడికి తీసుకోవలసిన చర్యల గురించి ఎస్పి సమీక్షించారు.


SAKSHITHA NEWS