SAKSHITHA NEWS

భారత్ లో సార్వత్రిక ఎన్నికలు… మొత్తం ఏడు దశల్లో పోలింగ్

నిన్న తొలి దశ పోలింగ్
ఎగ్జిట్ పోల్స్ నిషేధిస్తూ ఈసీ నోటిఫికేషన్

దేశంలో సార్వత్రిక ఎన్నికలు ఇవాళ (ఏప్రిల్ 19) ప్రారంభం అయ్యాయి. ఈసారి లోక్ సభ ఎన్నికలతో పాటు ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహిస్తున్నారు. మొత్తం 7 దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. అదే సమయంలో 12 రాష్ట్రాల్లో 25 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి.

నిన్న దేశంలో తొలి దశ పోలింగ్ జరిగింది. ఈ తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. దేశంలో ఎన్నికలు జరుగుతున్నందున ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం విధిస్తున్నట్టు తెలిపింది.

ఏప్రిల్ 19వ తేదీ ఉదయం 7 గంటల నుంచి జూన్ 1వ తేదీ సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించరాదని ఈసీ స్పష్టం చేసింది. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఏ ఎలక్ట్రానిక్ మీడియాలోనూ ఎన్నికల ఫలితాలు, సర్వేలు, ఒపీనియన్ పోల్స్ ప్రదర్శించరాదని ఈసీ పేర్కొంది.

WhatsApp Image 2024 04 20 at 1.26.32 PM

SAKSHITHA NEWS