SAKSHITHA NEWS

ముగిసిన బాలాపూర్ గణపతి లడ్డూ వేలం

30 లక్షలకు దక్కించుకున్న కొలన్ శంకర్ రెడ్డి

హైదరాబాద్ :
బాలాపూర్ లడ్డూ ప్రసాదం వేలం పాట ముగిసింది హైద్రాబాద్ బాలాపూర్ లడ్డూ వేలం పాట 1994లో ప్రారంభమైంది.

1994లో రూ.450తో ప్రారంభమైన వేలం పాట ప్రస్తుతం లక్షల్లోకి చేరింది. రాజకీయ నాయకులు, రియల్ ఏస్టేట్ వ్యాపారులు లడ్డూను దక్కించుకునేం దుకు వేలంపాటలో పాల్గొనడంతో ప్రతి ఏటా దీని దర పెరుగుతూ వస్తోంది.

1994 నుంచి 2002 వరకు వేలల్లోనే లడ్డూ ధర పలికింది. కానీ, 2002లో ఈ లడ్డూ ధర లక్ష రూపాయాలు దాటింది. అప్పట్లో కందాడ మాధవరెడ్డి రూ.1.05 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు.

అప్పటి నుంచి లడ్డూ ధర ప్రతి ఏటా పెరుగుతూనే ఉంది. ఈ ఏడాది రూ.30 లక్షల వెయ్యి రూపాయాల కు కొలను శంకర్ రెడ్డి ఈ లడ్డూను దక్కించుకున్నా రు.

ఈ వేలంపాటలో వచ్చిన డబ్బును గ్రామాభివృద్ది కోసం ఖర్చు చేస్తారు. బాలాపూర్ లడ్డూ వేలం పాట ప్రభావం నగరంలోని ఇతర ప్రాంతాలపై కన్పిస్తోంది.

గణేష్ లడ్డూను వేలం పాటను దక్కించుకుంటే మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం. అందుకే వేలంపాటలో లడ్డూను దక్కించుకునేందుకు భక్తులు పోటీ పడుతుంటారు….


SAKSHITHA NEWS