SAKSHITHA NEWS

సామాజిక న్యాయమే ఊపిరిగా అణగారిన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ఎన్నో మహోన్నతమైన సేవలందించిన సంస్కరణల యోధుడు బాబూ జగ్జీవన్ రామ్ అని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ అన్నారు. ఆయన జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు.
బాబూ జ‌గ్జీవ‌న్ రామ్ 117వ జ‌యంతి సంద‌ర్భంగా సూర్యాపేట కోత్త బస్టాండు వద్ద అయన విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. తదుపరి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన జయంతి వేడుకల్లో ఆదనవు కలెక్టర్ రెవెన్యూ తో కలసి పాల్గొని బాబూ జగ్జీవన్ రామ్ చిత్ర పటానికి పూల మాలలు చేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా
కలెక్టర్ మాట్లాడుతూ సామాజిక న్యాయం, విశిష్ట పార్లమెంటేరియన్, దేశ తొలి కార్మిక శాఖామంత్రి అలాగే ఉప ప్రధానిగా దేశానికి ఎన్నో మహోన్నతమైన సేవలు అందించారని అన్నారు. కేంద్ర కార్మిక మంత్రిగా అమలు చేసిన కార్మిక చట్టాలు ఇప్పటికి అమలులో ఉన్నాయని కార్మిక సంక్షేమానికి ఎనలేని సేవలు అందించారని అలాగే ఏప్రియల్ నెల లో ముగ్గురు మహనీయులు జన్మ దిన వేడుకలు జరుపుకోవడం హర్షించదగ్గ విషయమన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.ఎస్. లత, ఆదనవు యస్.పి ఎం. నాగేశ్వరరావు, సోషల్ వెల్ఫేర్ అధికారిని లత, జిల్లా అధికారులు, తహసీల్దార్ శ్యామ్ సుందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్,
కుల సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2024 04 05 at 4.07.30 PM

SAKSHITHA NEWS