టిప్పర్‌ డ్రైవర్‌కి టికెట్‌ ఇస్తే తప్పేంటి బాబూ?: సీఎం జగన్‌

Spread the love

తిరుపతి : చంద్రబాబు కారణంగానే ఇవాళ వృద్ధులు పింఛన్‌ కోసం ఎండలో నిలబడాల్సి వచ్చిందని.. వలంటీర్లపై నిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించింది టీడీపీనేనని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు..

మధ్యాహ్నాం తిరుపతి జిల్లా చిన్నసింగమలలో లారీ, ఆటో డ్రైవర్లతో సీఎం జగన్‌ ముఖాముఖి నిర్వహించారు.

“ఒక టిప్పర్‌ డ్రైవర్‌కు సీటు ఇచ్చానని చంద్రబాబు అవహేళన చేశారు. టిప్పర్‌ డ్రైవర్‌ను చట్ట సభలో కూర్చోబెట్టేందుకే ఎమ్మెల్యేగా నిలబెడుతున్నా. ఒక టిప్పర్‌ డ్రైవర్‌కు టికెట్‌ ఇస్తే తప్పేంటి?. ఏం తప్పు చేశానని టీడీపీ ఇవాళ నన్ను అవహేళన చేస్తోందని” సీఎం జగన్‌ నిలదీశారు.

“వీరాంజనేయులు(శింగనమల నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ అభ్యర్థి) ఎంఏ ఎకనామిక్స్‌ చదివాడు. చంద్రబాబు హయాంలో ఉద్యోగం రాకపోయినా వీరాంజనేయులు బాధపడలేదు. ఉపాధి కోసం వీరాంజనేయులు టిప్పర్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అయితే టీడీపీలో కోట్ల రూపాయలు ఉన్నవారికే చంద్రబాబు సీట్లు ఇస్తున్నారని” ఈ సందర్భంగా సీఎం జగన్‌ ప్రస్తావించారు..

Related Posts

You cannot copy content of this page