SAKSHITHA NEWS

Ayuktha Foundation supports youth preparing for competitive exams

పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు అండగా ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి*

కల్వకుర్తి మండలం మార్చాల గ్రామంలో పోలీసు ఎస్సై మరియు కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత పొందిన వారికి బుట్లు, టీషర్ట్లు పంపిణీ చేశారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు సుంకిరెడ్డి వరప్రసాద్ రెడ్డి అభ్యర్థులకు బూట్లు,టీషర్ట్లు అందజేశారు.

పోలీస్ ఈవెంట్ ఉద్యోగాల్లో ఉత్తీర్ణత సాధించాలని, ఉద్యోగం కోసం కృషి చేయాలని లక్ష్యం చేరుకున్నంత వరకు పోరాడాలని సూచించారు. ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యా వైద్యం ఉపాధి అనే నినాదంతో సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.

మార్చాల గ్రామానికి ఫౌండేషన్ నుండి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టిన సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామస్తులు మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ నిజామోద్దీన్,మాజీ వార్డు సభ్యులు MA ఖాలీల్,రామానుజన్,

నామాని శ్రీనువాసులు,అదిరాల యదయ్య,ఆవ తిరుపతి,రామస్వామి,బీరయ్య,మేకల స్వామి,ఓర్సు యాదగిరి, మధు,శివ కుమార్,పాషా,ఐక్యత ఫౌండేషన్ సభ్యులు ఆవ గణేష్,హసన్,రాఘవేందర్ యాదవ్,జగన్,జంగయ్య, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS