నెంబర్ ప్లేట్ లేని ఆరు వాహనాలపై కేసులు నమోదు
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్
వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడంతో చాలా మంది రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతున్నారని ట్రాఫిక్ సిఐ మోహన్ బాబు తెలిపారు. ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు పర్యవేక్షణలో ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో జడ్పీ సెంటర్ వద్ద శుక్రవారం ఆయన వాహనదారులకు హెల్మెట్ వాడకం వలన కలిగే ప్రయోజనాలను వాహనదారులకు వివరిస్తూ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి తమ విలువైన ప్రాణాలు కాపాడుకోవాలని సూచించారు.హెల్మెట్ ధరించి వాహనాలు నడపటం వలన ఒక రక్షణ కవచంలా ఉపయోగపడుతుందని అన్నారు. అదేవిధంగా నగరంలో నెంబర్ ప్లేట్ లేకుండా రోడ్లపై తిరుగుతున్న ఆరు ద్విచక్ర వాహనాలపై ఖమ్మం వన్ టౌన్, టూ టౌన్ , త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లలో 420/511 మరియు మోటార్ వెహికల్ చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. నెంబరు ప్లేట్ లేకుండా తిరిగే వాహనాలు, ర్యాష్ డైవింగ్, హెల్మెట్ ధరించని వాహనాలపై దృష్టి సారించి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్ల తెలిపారు.
కార్యక్రమంలో ఎస్సై రవి, వెంకన్న, సాగర్ పాల్గొన్నారు