ప్రకృతి వ్యవసాయంతో ఆరోగ్యకరమైన పంటలతో పాటు అధిక దిగుబడులు పొందవచ్చునని ప్రకృతి వ్యవసాయం పై రైతులకు అవగాహన సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన..
-నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మరియు పల్నాడు జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ ఐఏఎస్
నరసరావుపేట మండలంలోని అల్లూరి వారి పాలెం గ్రామంలో ప్రకృతి వ్యవసాయ విధానాల పై అవగాహన సదస్సు కార్యక్రమానికి నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మరియు పల్నాడు జిల్లా కలెక్టర్ శ్రీ లోతేటి శివశంకర్ ఐఏఎస్ మరియు జిల్లా వ్యవసాయ అధికారులు కలిసి హాజరయ్యారు.ఈ సందర్భంగా డాక్టర్ గోపిరెడ్డి మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంలో ద్రవ జీవామృతంతో సూక్ష్మజీవులు అభివృద్ధి చెంది, పైరు ఏపుగా పెరుగుతుందని వివరించారు. అదే క్రమంలో చీడపీడలను తట్టుకుని వేరు శాతం అభివృద్ధి చెందుతుందన్నారు.
రైతులు అధిక దిగుబడుల కోసం ఎరువులు, క్రిమిసంహారక మందులు విచ్చలవిడిగా వాడుతుండడంతో నేల కలుషితమవుతుందన్నారు. దీంతో దిగుబడులు భారీగా పడిపోతున్నాయని పేర్కొన్నారు. అలాకాకుండా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో వ్యవసాయం చేయడం వలన భూమిలో సారం పెరగడంతో పాటు దిగుబడులు కూడా పెరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ చైర్మన్ , జిల్లా వ్యవసాయ అధికారులు, ఏడీలు, ఏవోలు, అగ్రికల్చర్ అసిస్టెంట్లు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, ఎంపీపీ, జడ్పిటిసి, వైస్ ఎంపీపీ, మండల కన్వీనర్, సర్పంచులు ఎంపీటీసీలు, స్థానిక గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున రైతులు తదితరులు పాల్గొన్నారు..