SAKSHITHA NEWS

వెనుకబడిన కులాల దరఖాస్తుల గడువు తేదీని పెంచాలి – అవిశెట్టి శంకరయ్య

చిట్యాల సాక్షిత ప్రతినిధి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన కులాల అభివృద్ధి కోసం ఆర్థిక సహకారాన్ని అందించడానికి లబ్ధిదారుల నుండి దరఖాస్తులు చేసుకోవడానికి జూన్ 20 చివరి తేదీగా ప్రకటించిన గడువును పెంచాలని కోరుతూ చిట్యాల తహసిల్దార్ జక్కర్తి శ్రీనివాస్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

ఈ సందర్భంగా చేతివృత్తిదారుల సంఘం జిల్లా నాయకులు అవిశెట్టి శంకరయ్య మాట్లాడుతూ వెనుకబడిన కులాల అభివృద్ధి కోసం వారు వృత్తి పరికరాలను సమకూర్చుకొని మరింత నైపుణ్యంతో ఉత్పత్తులను తయారు చేసుకోవడానికి ఆసరాగా లక్ష రూపాయలు ఆర్థిక సహకారాన్ని అందిస్తామని ప్రభుత్వం ప్రకటించడాన్ని అభినందిస్తున్నామని అన్నారు .

అదే సందర్భంగా జూన్ 9 నుండి జూన్ 20వ తేదీ వరకు లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించడం ద్వారా వెనుకబడిన కులాల్లో వృత్తులు చేసుకునే వారు ,అత్యంత పేద వర్గాలు ,చదువు రానటువంటి వారు ఈ తక్కువ సమయాన్ని ఉపయోగించుకోలేకపోవడంతో పాటు కులము ఆదాయ ధ్రువీకరణ పత్రాలు పొందడానికి వస్తున్నటువంటి సాంకేతిక కారణాలవల్ల ఇంకా అనేకమంది ఈ పత్రాలను పొందక దరఖాస్తులు చేసుకోలేకపోయారు.

అందువల్ల నిజమైన లబ్ధిదారులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరి వారు అభివృద్ధి చెందాలంటే లబ్ధిదారులందరూ దరఖాస్తు చేసుకునే విధంగా ప్రభుత్వమే తగిన ప్రచారాన్ని నిర్వహించాలి అందరికీ సమాచారాన్ని అందించాలి అందుకు అనుగుణంగా దరఖాస్తుల గడువును మరో నెల రోజులు పెంచాలని కోరుతున్నామని అన్నారు .ఈ కార్యక్రమంలో రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు రుద్రారపు పెద్దలు, జిల్లా కమిటీ సభ్యులు అక్కెనపల్లి నాగయ్య, వడ్డెర వృత్తిదారుల సంఘం జిల్లా నాయకులు రూపని శ్రీను ,రూపని లక్ష్మణ్, అర్జున్, యాదయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS