నా కెరీర్ లోనే ఛాలెంజింగ్ పాత్ర ‘మట్టి కుస్తీ’లో చేశా: హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి ఇంటర్వ్యూ

Challenging Role of My Career in ‘Matti Kusti’: Heroine Aishwarya Lakshmi Interview నా కెరీర్ లోనే ఛాలెంజింగ్ పాత్ర ‘మట్టి కుస్తీ’లో చేశా: హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి ఇంటర్వ్యూ హీరో విష్ణు విశాల్ హీరోగా చెల్లా అయ్యావు దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ, స్పోర్ట్స్ డ్రామా ‘మట్టి కుస్తీ. ఐశ్వర్య లక్ష్మికథానాయికగా నటిస్తోంది. ‘ఆర్ టీ టీమ్‌వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్‌లపై మాస్ మహారాజా రవితేజతో కలిసి విష్ణు విశాల్ నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలౌతోంది. ఈ నేపధ్యంలో కథానాయిక ఐశ్వర్య లక్ష్మి విలేఖరుల సమావేశంలో ‘మట్టి కుస్తీ’ విశేషాలని పంచుకున్నారు. ‘మట్టి కుస్తీ’ కథని ఎప్పుడు విన్నారు ? మూడేళ్ళ క్రితం కోవిడ్ కి ముందే  ‘మట్టి కుస్తీ’ కథ విన్నాను. నాకు చాలా నచ్చింది. అయితే ఇందులో హీరోయిన్ పాత్ర చాలా సవాల్ తో కూడుకున్నది. ఆ పాత్రకు న్యాయం చేయలేనని అనిపించింది. ఇదే విషయం దర్శకుడికి చెప్పా. తర్వాత కోవిడ్ వచ్చింది. మూడేళ్ళ తర్వాత స్క్రిప్ట్ మళ్ళీ నా దగ్గరికే వచ్చింది. ఈ గ్యాప్ లో కొన్ని సినిమాలు చేయడం వలన కాన్ఫిడెన్స్ వచ్చింది.  దీంతో ‘మట్టి కుస్తీ’ ని చేయాలని నిర్ణయించుకున్నా. ‘మట్టి కుస్తీ’ లో అంత సవాల్ గా అనిపించిన అంశాలేంటి? పాత్ర చాలా ఫిజికల్ వర్క్ ని డిమాండ్ చేస్తుంది. దానికి చాలా ఫిజికల్ ప్రిపరేషన్ కావాలి. ట్రైలర్ లో స్టంట్స్ చూసే వుంటారు. ఎమోషనల్ సీన్స్ ని చేయడం నాకు ఇష్టమే. కామెడీ అనేది నా వరకూ చాలా కష్టం. మొదటి సారి ఇందులో కామెడీని ప్రయత్నించా. ఇదివరకు నేను చేసిన పాత్రల్లో కామెడీ లేదు. ‘మట్టి కుస్తీ’ నాకు ఓ సవాల్. ప్రేక్షకులు ఎలా తీసుకుంటారో తెలీదు. దర్శకుడు నా ఫెర్ ఫార్మెన్స్ పట్ల చాలా ఆనందంగా వున్నారు. ప్రేక్షకులకు కూడా నచ్చుతుందనే నమ్మకం వుంది. ‘మట్టి కుస్తీ’ ఎలా ఉండబోతోంది?  ‘మట్టి కుస్తీ’ ఫ్యామిలీ డ్రామా. ఇది భార్యభర్తల కుస్తీ(నవ్వుతూ) కుస్తీ, ఇగో, వినోదం అన్నీ ఎలిమెంట్స్ వుంటాయి. ప్రతి ఒక్కరూ ‘మట్టి కుస్తీ’ కి కనెక్ట్ అవుతారు. ఇంత చక్కని ఫ్యామిలీ ఎమోషన్స్, వినోదం వున్న చిత్రం ఈ మధ్య కాలంలో రాలేదు. ఆడ మగ సమానమే అనే సందేశాన్ని చాలా వినోదాత్మకంగా చూపించాం. పైసా వసూల్ మూవీ ‘మట్టి కుస్తీ’. విష్ణు విశాల్ తో పని చేయడం ఎలా అనిపించింది? విష్ణు విశాల్ స్ఫూర్తినిచ్చే వ్యక్తి. చాలా హార్డ్ వర్క్ చేస్తారు. ది బెస్ట్ కోసం ప్రయత్నిస్తుంటారు. ప్రమోషన్స్ మొదలుపెట్టినప్పటి నుండి ఆయన సరిగ్గా నిద్రకూడా పోలేదు. విష్ణు విశాల్ కి కథల ఎంపికలో మంచి అభిరుచి వుంది. ఆయన లాంటి విజన్ చాలా తక్కువ మందిలో కనిపిస్తుంటుంది. ఆయన నుండి చాలా నేర్చుకున్నాను. నటుడిగా, నిర్మాతగా ఆయన ప్రయాణం అద్భుతం.  ఆయనతో పని చేయడం చాలా అనందం గా వుంది. తెలుగు ప్రేక్షకులు గురించి మీ అభిప్రాయం ? తెలుగు ప్రేక్షకులు సినిమాని గొప్పగా ప్రేమిస్తారు. అందుకే తెలుగు చిత్ర పరిశ్రమ ఇండియాలోనే  బిగ్గెస్ట్ ఇండస్ట్రీ గా ఎదిగింది. టాలీవుడ్, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని రూల్ చేస్తోంది. తెలుగు నుండి వస్తున్న ప్రతి ప్రాజెక్ట్ కు గొప్ప ఆదరణ వస్తోంది. చాలా పరిశ్రమలు తెలుగు ఇండస్ట్రీని ఫాలో అవ్వడం గమనించాను. తెలుగు ప్రేక్షలులకు సినిమా పట్ల వున్న అభిమానం, ప్రేమే దీనికి కారణం. తెలుగు సినిమాలు చూస్తారా? మీ అభిమాన నటులు ఎవరు ? తెలుగు సినిమాలు చూస్తాను. అందరూ ఇష్టమే. నటీనటులందరూ ప్రేక్షకులకు వినోదం పంచడానికి కృషి చేస్తారు. ప్రేక్షకులు ఇష్టపడే సినిమాలు చేస్తారు. సాయి పల్లవి, సత్యదేవ్ లతో పరిచయం వుంది.…

‘హిట్ 2’… తప్పకుండా హిట్ అవుతుంది.. డౌటే లేదు:  ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి

‘Hit 2‘… will definitely be a hit… no doubt: Director S.S. Rajamouli తెలుగు సినిమా నుంచి వ‌స్తోన్న మ‌రో క్వాలిటీ మూవీ ‘హిట్ 2’… తప్పకుండా హిట్ అవుతుంది.. డౌటే లేదు:  ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి అడివి శేష్…

డిసెంబర్ 2 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు “దోస్తాన్”

“Dostan” in front of grand audience on 2nd December డిసెంబర్ 2 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు “దోస్తాన్” శ్రీ సూర్య మూవీస్ క్రియేషన్స్ పతాకంపై సిద్ స్వరూప్ , కార్తికేయ , ఇందు ప్రియ, ప్రియ…

నిజ జీవితంలోనూ గోపీలానే ఉంటాను.. ‘మసూద’ విజయంపై హీరో తిరువీర్

I will be like Gopi in real life too.. Hero Thiruveer on the success of ‘Masuda‘ నిజ జీవితంలోనూ గోపీలానే ఉంటాను.. ‘మసూద’ విజయంపై హీరో తిరువీర్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ‘మళ్ళీ రావా’,…

నిఖిల్, అనుపమ జంటగా నటిస్తున్న “18 పేజీస్” చిత్రం కోసం “టైం ఇవ్వు పిల్ల” అనే పాట పాడిన తమిళ స్టార్ హీరో శింబు

*Tamil star hero Simbu sang the song “Time Ivyu Pilla” for Nikhil and Anupama’s movie “18 Pages“* *నిఖిల్, అనుపమ జంటగా నటిస్తున్న “18 పేజీస్” చిత్రం కోసం “టైం ఇవ్వు పిల్ల” అనే పాట…

 ”నేను స్టూడెంట్ సర్!’ ఫస్ట్ సింగిల్ మాయే మాయే డిసెంబర్1న విడుదల

“I am a student sir!” First single Maye Maye released on 1st December బెల్లంకొండ గణేష్, రాఖీ ఉప్పలపాటి, ‘నాంది’ సతీష్ వర్మ, ఎస్వీ2 ఎంటర్‌ టైన్‌ మెంట్స్ ”నేను స్టూడెంట్ సర్!’ ఫస్ట్ సింగిల్ మాయే మాయే డిసెంబర్1న విడుదల యంగ్ హీరో బెల్లంకొండ గణేష్ యాక్షన్ థ్రిల్లర్ ”నేను స్టూడెంట్ సర్!’. ఎస్వీ2 ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో ప్రొడక్షన్ నంబర్ 2 గా వస్తున్న ఈ చిత్రాన్ని ‘నాంది’ సతీష్ వర్మ నిర్మిస్తుండగా నూతన దర్శకుడు రాకేష్ ఉప్పలపాటి దర్శకత్వం వహిస్తున్నారు. దర్శకుడు కృష్ణ చైతన్య కథను అందించారు.  ఇటివలే విడుదల చేసిన ఈ చిత్రం టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది, తాజాగా చిత్ర యూనిట్ మ్యూజికల్ ప్రమోషన్స్ ని ప్రారభించింది. ‘నేను స్టూడెంట్ సర్!’ ఫస్ట్ సింగిల్ మాయే మాయే డిసెంబర్ 1న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన సాంగ్ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో గణేష్, అవంతికల జోడి చూడముచ్చటగా వుంది. ఈ చిత్రంతో అలనాటి నటి భాగ్యశ్రీ కూతురు అవంతిక దస్సాని హీరోయిన్ గా అరంగేట్రం చేస్తోంది. సముద్రఖని, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. అనిత్ మధాడి డీవోపీగా, చోటా కె ప్రసాద్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. కళ్యాణ్ చక్రవర్తి ఈ చిత్రానికి డైలాగ్స్ అందిస్తున్నారు. నటీనటులు: బెల్లంకొండ గణేష్, అవంతిక దస్సాని, సముద్రఖని, సునీల్, శ్రీకాంత్ అయ్యంగార్, ఆటో రాంప్రసాద్, చరణ్‌దీప్, ప్రమోధిని, రవి శివతేజ తదితరులు. సాంకేతిక విభాగం దర్శకత్వం: రాఖీ ఉప్పలపాటి నిర్మాత: ‘నాంది’ సతీష్ వర్మ సంగీతం: మహతి స్వర సాగర్ డీవోపీ: అనిత్ మధాడి ఎడిటర్: ఛోటా కె ప్రసాద్ కథ: కృష్ణ చైతన్య డైలాగ్స్: కళ్యాణ్ చక్రవర్తి కొరియోగ్రఫీ: రఘు మాస్టర్…

ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ పాన్ ఇండియా మూవీ ‘హను-మాన్’ టీమ్ ని అభినందించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Union Minister Kishan Reddy congratulated the team of Prashant Verma and Teja Sajja Pan India Movie ‘Hanu-Man‘ ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ పాన్ ఇండియా మూవీ ‘హను-మాన్’ టీమ్ ని అభినందించిన కేంద్రమంత్రి కిషన్…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE