టిడిపి ఎమ్మెల్యేలపై దాడి ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ
శాసనసభ గౌరవాన్ని వైసీపీ ఎమ్మెల్యేలు మంటగలిపారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిని వైసీపీ తట్టుకోలేకపోతుంది.
అసెంబ్లీ ఘటన రాష్ట్ర చరిత్రలోనే బ్లాక్ డే.
౼ నందికనుమ బ్రహ్మయ్య
టీడీపీ ప్రకాశం జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు.
అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ దళిత శాసనసభ్యుడు డాక్టర్ డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారి పైనా అలానే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారి పైనా వైసీపీ శాసనసభ్యులు చేసిన దాడి ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని టీడీపీ ప్రకాశం జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు నందికనుమ బ్రహ్మయ్య అన్నారు. ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్న తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులపై ఇలా దాడులు చేయడం అమానుషం అని నందికనుమ అన్నారు. ఇలాంటి అప్రజాస్వామికి చర్యలను నందికనుమ తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్షాల గొంతు నొక్కే Go నెంబర్ 1 రద్దు చేయాలని కోరుతూ, అసెంబ్లీలో స్పీకర్ పోడియం వద్ద నిరసన తెలియజేస్తున్న తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులపై నోటి దురుసుతో ఇష్టారాజ్యంగా వ్యవహరించడమే కాకుండా దాడులు చేసిన వైసీపీ శాసనసభ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని నందికనుమ డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి తట్టుకోలేక పోతోందని, అందుకే దాడులకు తెగబడ్డారని నందికనుమ విమర్శించారు. తెదేపా నేతలపై అసెంబ్లీలో దాడి ఘటన చరిత్రలోనే బ్లాక్ డే అని, అన్నింటిని ప్రజలు గమనిస్తున్నారని, వైసీపీ కి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని నందికనుమ బ్రహ్మయ్య హెచ్చరించారు.