భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం

Spread the love
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం

సాక్షిత న్యూస్……..

ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అశ్వారావుపేట మండలం లో విస్తృత పర్యటన

జారే ఆదినారాయణ ఎమ్మెల్యే గా తన యొక్క పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే

మొట్ట మొదట కార్యాచరణ లో భాగంగా అశ్వారావుపేట నియోజకవర్గం… అశ్వారావుపేట మండలం లోను మరియు పలు గ్రామీణ ప్రాంతాల లో విస్తృత పర్యటన ను కొనసాగించారు

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జారే.

అశ్వారావుపేట : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కార్యక్రమాన్ని ఈరోజు అశ్వారావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ లాంచనంగా ప్రారంభించారు.

చేయూత కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

అశ్వారావుపేట : రాజీవ్ ఆరోగ్యశ్రీ రూ.10 లక్షల వైద్య సాయం కార్యక్రమాన్ని ఈరోజు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో శాసన సభ సభ్యులు గా జారే ఆదినారాయణ ప్రారంభించారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే జారే

అశ్వారావుపేట: కొద్దిరోజుల క్రితం బీభత్సం సృష్టించిన మిచౌంగ్ తుఫాను కారణంగా నష్టాల పాలైన అశ్వారావుపేట పట్టణంలోని దాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఈరోజు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సందర్శించారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ద్వారా తగు నష్టపరిహారం అందే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు.

ఎమ్మెల్యే జారే ఆదినారాయణ వెంట…..అశ్వారావుపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మండల సీనియర్ నాయకులు,కార్యకర్తలు,కాంగ్రెస్ పార్టీ భిమనులు.. అశ్వారావుపేట మండలం లో ని ప్రజలు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page