తెలుగుజాతి గర్వించే రామోజీరావు స్పూర్తితో తెలుగు భాషను సంరక్షిస్తానని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. రామోజీ రావు పేరిట ఏర్పాటు చేసిన రామోజీ ఎక్సలెన్స్ జాతీయ అవార్డుల ప్రదాన కార్యక్రమం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రామోజీ ఎక్స్ లెన్స్ అవార్డుల ప్రదాన కార్యక్రమం నిర్వహిస్తున్న కుటుంబ సభ్యులను మనస్పూర్తిగా అభినందించారు.
ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, రామ్మోహన్‌నాయుడు, బండి సంజయ్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
