ఎమ్మెల్యే భగత్ సమక్షంలో గులాబీ పార్టీలోకి అనుముల మండల కాంగ్రెస్ నాయకులు

Spread the love

మాజీ మంత్రి జానారెడ్డి కి షాకిచ్చిన కాంగ్రెస్ నాయకులు

హాలియా సాక్షిత ప్రతినిధి

అనుముల మండల కేంద్రంలో మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి సొంత గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు షాకిచ్చారు. కాంగ్రెస్ పార్టీ నుండి నాయకులు ఎమ్మెల్యే నోముల భగత్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే భగత్ మాట్లాడుతూ గతంలో మా నాన్న నోముల నరసింహయ్య 12000 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. ఓటమికి ప్రధాన కారణం 70 పోలింగ్ కేంద్రాల్లో రిగ్గింగ్ చేసి గెలిచారన్నారు.
2018 స్థానిక సంస్థల ఎలక్షన్ లో 70 పోలింగ్ కేంద్రాలలో రిగ్గింగ్ పోలింగ్ కేంద్రాలను గుర్తించి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిపించామని గత పాలకులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి హాలియా మున్సిపాలిటీలో రాజకీయం చేసేవారని అన్నారు. నోముల నరసింహయ్య (మా నాన్న) ధైర్యంతో ప్రజలలో చైతన్యం తీసుకొచ్చి భయభ్రాంతులకు గురై ప్రజలకు నమ్మకం కల్పించారు. అనుములలో కోటి పది లక్షల రూపాయలు ఏడో వార్డు ఎనిమిదో వార్డు తొమ్మిదో వార్డు అభివృద్ధికి ఖర్చు పెట్టామన్నారు.
హలియా మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత కొత్తవారిని నియమించిన అవకాశమున్న పాతవారినీ తొలగించకుండా 55 కుటుంబాలు ఆదుకున్న పార్టీ బిఆర్ఎస్ పార్టీ అని
అన్నారు. హలియా మున్సిపాలిటీ అభివృద్ధి చెందకుండా కోర్టులలో కేసులు వేసి కబ్జా భూములు సొంత భూములు అన్ని కోర్టుకెక్కుతున్నారు కాంగ్రెస్ నాయకులు.సుమారుగా 40 కుటుంబాలు గుడిసెలలో నివసిస్తున్న ప్రజల మార్పు తీసుకురావడానికి సొంత ఇల్లు నిర్మాణానికి ప్రక్రియ చేపట్టామని కబ్జా గురైన భూములలో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ మరియు వెజ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణం చేపట్టాము.


మిర్యాలగూడ రోడ్డు వేగవంతంగా అభివృద్ధి చెందుతుందని అనుముల అభివృద్ధి చెందడం లేదని ప్రభుత్వ భవనాలు అన్ని అనుముల మధ్యలో కబ్జా కి గురైన భూములలో నిర్మిస్తున్నామన్నారు.
ఇక్కడ ప్రజలు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు నేను 24 గంటలు నీకు అందుబాటులో ఉంటానని ధైర్యం చెప్పారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, మాజీ ఎడమ కాలువ చైర్మన్ మలిగిరెడ్డి లింగారెడ్డి, మార్కెట్ చైర్మన్ జవ్వాజి వెంకటేశ్వర్లు, మునిసిపల్ వైస్ చైర్మన్ నల్గొండ సుధాకర్, మండల పార్టీ అధ్యక్షులు కూరాకుల వెంకటేశ్వర్లు, పట్టణం అధ్యక్షులు చెరుపల్లి ముత్యాలు,కౌన్సిలర్ ప్రసాద్ నాయక్, కో ఆపషన్ మెంబర్ రావుల లింగయ్య, మార్కెట్ డైరెక్టర్ సురభి రాంబాబు, పట్టణ కార్యదర్శి దోరెపల్లి వెంకన్న,7వార్డు ఇంచార్జ్ దుర్గా రావు,వార్డు అధ్యక్షులు జింకల ప్రసాద్, బొడ్డుపల్లి ఈదయ్య, జూపల్లి సైదులు, నల్లబోతు లింగయ్య,జానపాటి శ్రీనివాస్,పెద్ద రామనర్సయ్య , పిల్లి వెంకట్ యాదవ్,బొద్దుపల్లి మురళి,టేకులపల్లి సైదులు, యూత్ అధ్యక్షులు చారి, ప్రధానకార్యదర్శి అశోక్ , మహేష్,తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page