ఆంధ్రప్రదేశ్ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ గుంటూరు

Spread the love

ఆంధ్రప్రదేశ్ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ గుంటూరు జిల్లా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో స్టేడియం వద్ద ఉన్న అంజుమాన్ షాది ఖానలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు,

ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి నూరిఫాతిమా హాజరయ్యారు,

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోని ముస్లింలకు రాజకీయ, ఆర్థిక, సామాజికపరంగా స్థాయిని, గుర్తింపును కల్పిస్తూ వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని అమె తెలిపారు.

గతంలో ముస్లింలకు 4 ఎమ్మెల్యే సీట్లను కేటాయిస్తే నేడు ఏకంగా 7 సీట్లు ఇవ్వడం హర్షించదగ్గ విషయమని. చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా ఉపముఖ్యమంత్రి పదవితో పాటు కేబినెట్‌ హోదా కలిగిన 12 కార్పొరేషన్లు కేటాయించారన్నారు.

ముస్లింలు సుభిక్షంగా, సంతోషంగా ఉండేందుకు వారి హక్కులను పూర్తిగా గౌరవించి, అత్యున్నతస్థాయికి తీసుకెళ్లేందుకు కృషిచేస్తున్నందుకు అందరూ సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి అండగా మరోసారి నిలవాలన్నారు.

ఈ కార్యక్రమంలో ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు రఫీ , రాష్ట్ర ఉపాధ్యక్షులు Dr ముస్తఫా మరియు మిర్సా బాబు,పఠాన్ జహీర్ ఖాన్, అంజుమాన్ గుంటూరు అధ్యక్షులు కర్నూమా,
వైస్సార్సీపీ నరసరావుపేట అసెంబ్లీ పరిశీలికులు గులాం రసూల్ , ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సభ్యులు వివిధ రాజకీయ పార్టీల నేతలు పాల్గొన్నారు..

Related Posts

You cannot copy content of this page