cm tdp ముఖ్యమంత్రిని కలిసిన అండమాన్ టీడీపీ అధ్యక్షుడు మాణిక్యరావు యాదవ్
పామూరు: అండమాన్ నికోబార్ దీవుల తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పామూరు మండలానికి చెందిన నక్కల మాణిక్యరావు యాదవ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మర్యాద పూర్వకంగా కలిశారు. గడచిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం కుటమి ఘన విజయం సాధించిన అనంతరం మాణిక్యరావు ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. వెనుకబడిన యాదవుల అభివృద్ధికి మరింత ప్రోత్సాహం అందించాలని అయన చంద్రబాబును కోరారు. రాష్ట్ర ప్రజలు సైకో పరిపాలనతో విసిగి పోయారని, అమరావతిని నామరూపాల్లేకుండా చేసిన వారు ప్రస్తుతం వారి ఉనికి కోల్పోయారని, చంద్రబాబు,పవన్ కళ్యాణ్,బీజేపీ రాష్ట్ర కార్యవర్గ కృషి వల్ల ఆంధ్రప్రదేశ్ కు తిరిగి పూర్వ వైభవం రావాలని కోరారు. అండమాన్,నికోబార్ దీవుల్లో 1985 నుంచి తెలుగుదేశం పార్టీని కాపాడుకుంటూ వస్తున్నామని,స్థానిక ప్రజల అవసరాలు తీర్చేందుకు తెలుగుదేశంపార్టీ కార్యాలయాన్ని అద్దె భవనంలో కొనసాగిస్తున్నామని మాణిక్యరావు యాదవ్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. పోర్టుబ్లెయిర్ లో తెలుగుదేశంపార్టీకి శాశ్వత సొంతభవనం నిర్మాణంకోసం భూమి కేటాయింపుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కలిసేందుకు అనుమతి కోరారు. దీనికి స్పందించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర విమానయాన శాఖామంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడితో మాట్లాడి రెండు రోజుల్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో భేటీ ఏర్పాటు చేయించి నట్లు మాణిక్యరావు యాదవ్ తెలిపారు. రానున్న రెండు రోజుల్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి కేంద్ర ప్రభుత్వానికి పోర్టుబ్లెయిర్ లో తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి భూమి కేటాయింపుపై వినతి పత్రం అందజేస్తామని అయన తెలిపారు. అండమాన్ దీవుల్లో అంచెలంచెలుగా తెలుగుదేశం పార్టీని అభివృద్ధి చేసి ఇప్పుడు టీడీపీ తరఫున నలుగురు కౌన్సిలర్లను గెలిపించుకున్నట్లు మాణిక్యరావు యాదవ్ తెలిపారు.రానున్న రోజుల్లో అండమాన్ నికోబార్ మున్సిపాలిటీలో తెలుదేశంపార్టీ పూర్తి ఆధిపత్యం సాధించేలా కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు.పార్టీ అభివృధికి అండమాన్ దీవులకు అవసరమైన ప్రతి అంశాన్ని తప్పకుండా సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చినట్లు మాణిక్య రావు యాదవ్ తెలిపారు.అండమాన్ దీవుల్లో తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి మాణిక్యరావు బృందం చేస్తున్న కృషిని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. అండమాన్ దీవుల స్ధానిక సమస్యలను కూడా పరిష్కరించేందుకు కేంద్రానికి లేఖ రాయాలని, అండమాన్ కు విమాన చార్జీలు విపరీతంగా పెరిగిపోవడంతో స్థానికులు ఇబ్బందులకు గురౌతున్నారు,దీనిపై దృష్టి సారించి టిక్కెట్ ధరలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని మాణిక్యరావు యాదవ్ ముఖ్యమంత్రిని కోరారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసిన వారిలో అండమాన్ టీడీపీ ఇన్చార్జి వీ మాధవనాయుడు, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ వి శ్యాం సుందర్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రిని కలిసిన అండమాన్ టీడీపీ అధ్యక్షుడు మాణిక్యరావు యాదవ్ cm tdp
Related Posts
హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా(89)
SAKSHITHA NEWS హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా(89) గుండెపోటుతో కన్నుమూత 1989 నుండి 2005 వరకు 4 సార్లు హర్యానా సీఎంగా పనిచేసిన ఓం ప్రకాష్ చౌతాలా SAKSHITHA NEWS
హైదరాబాద్లో 100 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం..
SAKSHITHA NEWS హైదరాబాద్లో 100 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం.. హైదరాబాద్ – ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో 100 అడుగుల ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్ఠాపనకు స్థలం మంజూరు చేసేందుకు సీఎం రేవంత్ అంగీకరించినట్లు తెలిపిన టీడీపీ నేత టీడీ జనార్దన్. కాగా…