SAKSHITHA NEWS

అనంతపురం జిల్లా సర్పంచుల అవగాహన సదస్సు_

ఉమ్మడి అనంతపురం జిల్లా, అనంతపురం టౌన్ లో ఈరోజు జరిగిన సర్పంచులు అవగాహన సదస్సు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించిన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చాంబర్ అధ్యక్షులు యలమంచిలి వెంకట బాబు రాజేంద్ర ప్రసాద్

ఈ సందర్భంగా బాబు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహించే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు మొదలగు అన్ని కార్యక్రమాలలోనూ గ్రామ ప్రథమ పౌరులైన సర్పంచ్ లనే సభాధ్యక్షులుగా ఉంచాలని, ఆహ్వాన పత్రిక ల్లోనూ, శిలాఫలకం మీద సర్పంచుల పేర్లు ఫోటోలు కూడా వేసి ఖచ్చితంగా ప్రోటోకాల్ పాటించే విధంగా స్పష్టమైన ప్రభుత్వ ఆదేశాలను అధికారులు ఇస్తూ… తగిన జీవోను జారీ చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన రాజేంద్ర ప్రసాద్.

అంతేకాక గ్రామాల్లో ఇవాళ సర్పంచుల కన్నా వాలంటీర్ల కే ఎక్కువ విలువ ఉంది అని, గౌరవ వేతనం కూడా సర్పంచులకు రూ,, 3000, వాలంటీర్లకు రూ,, 5000 గా ఎక్కువ ఉందనీ, కనుక సర్పంచ్లకు, ఎంపీటీసీ లకు రూ,, 15000 లు, ఎంపీపీ లకు, జడ్పిటిసి లకు రూ,, 30000 లు, కౌన్సిలర్ లకు రూ,, 20000 లు, కార్పొరేటర్లకు రూ,, 30000 లును గౌరవ వేతనాలు గా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని మా డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించకపోతే రాష్ట్రంలోని ఉన్న సర్పంచులు అందరూ ఏకతాటిపైకి వచ్చి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ మరియు రాష్ట్ర సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో ఉద్యమాలు ఉద్ధృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించిన రాజేంద్రప్రసాద్.

ఈ కార్యక్రమంలో అనంతపురం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కాల్వ శ్రీనివాసులు గారు, ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి గారు, ఆంధ్ర ప్రదేశ్ పంచాయతీ రాజ్ ఛాంబర్ మరియు ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం రాష్ట్ర నాయకులు వేలూరు రంగయ్య, లాయర్ ప్రతాప్ నాయుడు, డేగల కృష్ణమూర్తి, గోపిశెట్టి వీరేష్, పసుపల హనుమంత రెడ్డి, మీనాక్షి నాయుడు, బిర్రు ప్రతాపరెడ్డి, యేజర్ల వినోద రాజు , సింగంశెట్టి సుబ్బరామయ్య, ముల్లంగి రామకృష్ణారెడ్డి, కొత్తపూ మునిరెడ్డి, చుక్క ధనుంజయ్ యాదవ్, అనేపు రామకృష్ణా నాయుడు, బొర్రా నాగరాజు, వానపల్లి ముత్యాలరావు, తదితరులు పాల్గొని ప్రసంగించారు.


SAKSHITHA NEWS