శంకర్‌పల్లి లో రైలు కింద పడి గుర్తు తెలియని మహిళ మృతి

SAKSHITHA NEWS

An unidentified woman died after falling under a train in Shankarpally

శంకర్‌పల్లి లో రైలు కింద పడి గుర్తు తెలియని మహిళ మృతి

శంకర్‌పల్లి:
రైలు కిందపడి గుర్తుతెలియని మహిళ మృతి చెందిన ఘటన శంకర్‌పల్లి లో జరిగింది. వికారాబాద్ రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మధ్యాహ్నం గం. 3.45 లకు పల్నాడు ఎక్స్ ప్రెస్ రైలు కిందపడి గుర్తు తెలియని మహిళ మృతి చెందిందన్నారు. రైల్వే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన మహిళను ఎవరైనా గుర్తించినట్లయితే వికారాబాద్ రైల్వే పోలీసులను సంప్రదించాలన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.


SAKSHITHA NEWS

Related Posts

You cannot copy content of this page