కృష్ణా రెడ్డి మరియు వారి సన్నిహితులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశం

Spread the love

కృష్ణా రెడ్డి మరియు వారి సన్నిహితులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థి డెప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి .


సాక్షిత : ఈ సమావేశంలో మాట్లాడుతూ తిరుపతి అభివృద్ధిని గమనించండి, మెట్రో నగరాలతో పోటీపడేలా మాస్టర్ ప్లాన్ రోడ్లు, ఫ్రీ లెఫ్ట్ రోడ్లు, స్లిప్వే రోడ్లు, నగర సుందరీకరణ చేసాము.

గతంలో తిరుపతి ఎలా ఉండేది..!! ఇప్పుడు ఎలా ఉందో గమనించాలని కోరుతున్నా, అభివృద్ధి జరిగిందని మీరు నమ్మితేనే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించండి, మీకు మరో 5ఏళ్ళు సేవ చేస్తానని తెలియచేస్తున్నా.

మాస్టర్ ప్లాన్ రోడ్లు నిర్మించేటప్పుడు నాకు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి.. నేను ఎక్కడా బయపడి రాజీ పడలేదు.. అన్ని సమస్యలను అధిగమించుకుంటూ నగరం అభివృద్దే లక్ష్యం పనిచేసుకుంటూ 18మాస్టర్ ప్లాన్ రోడ్లు పూర్తి చేయగలిగాను.

పారిశుధ్యం విషయంలో దేశంలోనే తిరుపతిని మొదటి స్థానంలో ఉంచాలనేదే నా లక్ష్యం.

భవిష్యత్తులో మరో 14మాస్టర్ ప్లాన్ రోడ్లు నిర్మిస్తాము, అభివృద్ధిని ఓటు వెయ్యాలని విజ్ఞప్తి చేస్తున్నా.. మీ అందరి సహాయసహకారాలు అందించండి.

Related Posts

You cannot copy content of this page