An inquiry should be held with the Supreme Court judge on the leak of NEET exam papers.
నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ పై సుప్రీంకోర్టు జడ్జి తో విచారణ జరపాలి…………
జనుపల కిషోర్ కుమార్ రెడ్డి, విద్యార్థి నాయకుడు, న్యాయవాది
*సాక్షిత వనపర్తి : దేశవ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలలో చదవడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన నీట్ పరీక్ష ఫలితాలపై అనేక అనుమానాలు వెలువడుతున్న తరుణంలో పరీక్ష నిర్వహించిన తీరుపై కేంద్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని, మే 5న పరీక్షను నిర్వహించడం జరిగింది.దాదాపు దేశవ్యాప్తంగా 24 లక్షల మంది విద్యార్థులు పరీక్షను రాశారు. ప్రకటించిన ఫలితాల్లో అనేక అవకతవకలు జరిగాయని విద్యార్థులు, విద్యార్ధి తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.వారి అనుమానాలకు సజీవ సాక్ష్యం ఆరుగురు విద్యార్థులకు 720 మార్కులకు 720 మార్కులు రావడం మరల వారి యొక్క పరీక్ష కేంద్రం ఒకటే కావడం వలన వారి అనుమానాలకు బలాన్నిస్తుంది. కావున తక్షణమే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసిన ఫలితాలపై కేంద్ర ప్రభుత్వం స్పందించి పరీక్ష రాసిన మెడికల్ విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే నీట్ పరీక్షను రద్దు చేయాలనీ దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వానికి చెప్పిన కూడా వారి మాటని పెడచెవిన పెట్టి, నిర్లక్ష్యం చేయడం ద్వారా వేలాది మంది ప్రతిభగల విద్యార్థులు మెడికల్ విద్యకు దూరమవుతున్నారు. ప్రస్తుత విద్యాసంవత్సరం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసిన ఫలితాలపై, పేపర్ లీకేజీలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని కిషోర్ కుమార్ రెడ్డి ఓ పత్రిక ప్రకటనలో డిమాండ్ చేయడం జరిగింది.