దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నేటి నుండి నిర్వహిస్తున్న కార్తీకమాస దీపోత్సవ వేడుకల్లో భాగంగా మొదటి కార్తీక సోమవారం(4 నవంబర్ 2024) కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించనున్న ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారికి ఆహ్వానం అందింది. ఈ మేరకు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ ప్రసాద్, ఆలయ ఈవో సుధాకర్ రెడ్డి, అర్చకులు మంత్రి సురేఖ గారిని హైదరాబాద్ లోని వారి నివాసంలో కలిసి, కార్తీకమాస దీపోత్సవం లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా అర్చకులు మంత్రిగారికి వేదాశీర్వచనం చేసి, స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందించారు. ఈవో సుధాకర్ రెడ్డి కార్తీక సోమవారం సందర్భంగా ఆలయంలో చేపట్టనున్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను మంత్రి గారికి వివరించారు.
కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించనున్న ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో
Related Posts
ఘనంగా పీవీ సింధు ఎంగేజ్మెంట్..
SAKSHITHA NEWS ఘనంగా పీవీ సింధు ఎంగేజ్మెంట్..రింగ్స్ మార్చుకున్న పీవీ సింధు, వెంకటదత్తసాయి. 22న రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లో సింధు పెళ్లి 24న హైదరాబాద్‌లో రిసెప్షన్. SAKSHITHA NEWS
రాహుల్ గాంధీ గారూ, ప్రేమను పంచడం అంటే ఇదేనా
SAKSHITHA NEWS రాహుల్ గాంధీ , ప్రేమను పంచడం అంటే ఇదేనా?: వీడియోను ట్వీట్ చేసిన కేటీఆర్ హైడ్రా కూల్చివేతలపై కేటీఆర్ నిలదీత మహిళలు ఇంట్లో ఉండగానే ఇళ్లను కూల్చుతున్నారంటూ ఆగ్రహం మీ కుటుంబంలో ఇలాంటి ఘటనలు జరిగితే అంగీకరిస్తారా? అని…