దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నేటి నుండి నిర్వహిస్తున్న కార్తీకమాస దీపోత్సవ వేడుకల్లో భాగంగా మొదటి కార్తీక సోమవారం(4 నవంబర్ 2024) కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించనున్న ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారికి ఆహ్వానం అందింది. ఈ మేరకు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ ప్రసాద్, ఆలయ ఈవో సుధాకర్ రెడ్డి, అర్చకులు మంత్రి సురేఖ గారిని హైదరాబాద్ లోని వారి నివాసంలో కలిసి, కార్తీకమాస దీపోత్సవం లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా అర్చకులు మంత్రిగారికి వేదాశీర్వచనం చేసి, స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందించారు. ఈవో సుధాకర్ రెడ్డి కార్తీక సోమవారం సందర్భంగా ఆలయంలో చేపట్టనున్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను మంత్రి గారికి వివరించారు.
కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించనున్న ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో
Related Posts
కామారెడ్డి నియోజకవర్గం మాచిరెడ్డి మండలం
SAKSHITHA NEWS కామారెడ్డి నియోజకవర్గం మాచిరెడ్డి మండలంలో రేవంతన్నకు రైతుల పాలాభిషేకం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఓ.బి.సి ప్రభుత్వ సలహాదారులు మరియు కామారెడ్డి నియోజకవర్గం ఇంచార్జ్ షబ్బీర్ అలీ ఆధ్వర్యంలో అదేవిధంగా, కామారెడ్డి నియోజకవర్గంలో డి.సి.సి…
కూకట్ పల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బస్తీ దవాఖానాలలో
SAKSHITHA NEWS కూకట్ పల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బస్తీ దవాఖానాలలో ఆకస్మిక తనిఖీలను చేపట్టారు. దవాఖానాలలో రోగులను ఆసుపత్రి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా దవాఖాన డాక్టర్లతో మాట్లాడుతూ నెలవారీగా ఆసుపత్రికి వస్తున్న వారి సంఖ్యను అడిగి…