Amit Shah, Nadda, Babu, Nitish strengthened Modi as NDA party leader
ఎన్డీయే పక్ష నేతగా మోడీ.. బలపరిచిన అమిత్ షా, నడ్డా, బాబు, నితీష్
2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 292 స్థానాల్లో విజయం సాధించిన ప్రభుత్వ ఏర్పాటు దిశగా ముందుకు సాగుతుంది. ఈ క్రమంలో నేడు పార్లమెంట్ లోని పాత భవన్ లో ఎన్డీయే పార్లమెంటరీ పక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి బీజేపీతో పాటు, టీడీపీ, జేడీయూ, లోక్ జనశక్తి, జనసేన ఎన్డీఏ లోని పార్టీల ఎంపీలందరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర రక్షణ మంత్రి అమిత్ షా ఎన్డీయే పక్ష నేతగా నరేంద్ర మోడీ పేరును ప్రతిపాదించగా.. మూడోసారి ఏకగ్రీవంగా ఆయనకు ప్రధాని అభ్యర్థిగా ఎన్నుకున్నారు. అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు, జేడీయూ నేత నితీష్ కుమార్, శివసేన ఏక్ నాథ్ షిండే, లోక్ జనశక్తి చిరాగ్ పాశ్వాన్, అజిత్ పవార్, మోడీకి మద్దతు తెలుపుతూ ప్రసంగించారు.