SAKSHITHA NEWS

బాపట్ల జిల్లా

తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బాపట్ల లో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

స్ఫూర్తి ప్రధాత డా.బీ.ఆర్.అంబేద్కర్: నరేంద్ర వర్మ

భారత రాజ్యాంగ నిర్మాత డా.బీ.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా బాపట్ల నియోజకవర్గంలోని ప్రతి మండలంలో, పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయా కార్యక్రమాలలో బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జ్ వేగేశన నరేంద్ర వర్మ ముఖ్య అతిథిగా పాల్గొని ఆ మహనీయుని విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు..

ముందుగా బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గల పార్టీ వ్యవస్థాపకులు,స్వర్గీయ నందమూరి తారకరామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి తదనంతరం నాయకులు, కార్యకర్తల తో కలిసి భారీ బైక్, కార్ల ర్యాలీ తో జమ్ములపాలెం ఫ్లై ఓవర్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి మొదలుపెట్టి రైల్వే స్టేషన్, కర్లపాలెం మండలం నందు దాస్ నగర్, ఐలాండ్ సెంటర్, మీదుగా పిట్లవానిపాలెం మండలంలో పల్లెకు వెళ్లే దారిలో ఉన్న అనేక అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నరేంద్ర వర్మ కామెంట్స్…

అట్టడుగు వర్గాల హక్కుల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన దార్శనిక నాయకుడు, సంఘ సంస్కర్త డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్.

సామాన్య దళిత కుటుంబంలో జన్మించిన అంబేద్కర్ నాడు దేశంలో ఉన్న సామాజిక పరిస్థితులు మూలంగా వర్గ వివక్ష ,సామాజిక బహిష్కరణ ఎదుర్కొని ఎన్నో కష్టాలు అనుభవించారు.

తరువాత కాలంలో కుల వ్యవస్థ నిర్ములన కొరకు అవిశ్రాంతంగా కృషి చేసిన మహనీయులు అంబేద్కర్.

చదువు ద్వారానే సమ సమాజ స్థాపన సాధ్యమని నమ్మి దళితులకు విద్యను అందించేందుకు , వారికి రాజకీయ అవకాశాలు కల్పించడానికి ఎంతోగానో కృషి చేశారు.

దేశానికి స్వాతంత్ర్యము సిద్దించిన తరువాత మొట్ట మొదటి న్యాయ శాఖ మంత్రిగా న్యాయ వ్యవస్థ నిర్మాణం లో కీలకపాత్ర పోషించారు. ఆయన ప్రవేశపెట్టిన ప్రగతిశీల చట్టం వలన మహిళలకు వారసత్వం గా ఆస్తి హక్కును అందించారు.

రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఛైర్మన్ గా రాజ్యాంగ నిర్మాణంలో కీలకపాత్ర పోషించి పౌరులందరికి సమానత్వం మరియు సామాజిక న్యాయం అందేలా చేసి కోట్లాది మందికి స్పూర్తిగా నిలిచిన ఆదర్శ ప్రాయులు అంబేద్కర్ గారు అని, ఆయన ను స్పూర్తిగా తీసుకొని మనందరం ఆయన అడుగుజాడల్లో నడుస్తూ వారి ఆశయసాధనకు కృషి చేద్దామని నరేంద్ర వర్మ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బాపట్ల పట్టణ, మండల, కర్లపాలెం మండల, పిట్లవానిపాలెం మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


SAKSHITHA NEWS