పోరాటాలతో పాటు ప్రజాసేవ కార్యక్రమాలలో డి.వై.యఫ్.ఐ, యస్.యఫ్.ఐ కార్యకర్తలు ముందుంటారు.

Spread the love

డి.వై.యఫ్.ఐ రాష్ట్ర కమటీ సభ్యులు చింతల.రమేష్.

-డి.వై.యఫ్.ఐ,యస్.యఫ్.ఐ సహకారంతో చిమ్మపుడి గ్రామంలో వికలాంగులకు ఉచిత డ్రై సైకిల్స్ పంపిణీ.

-డి.వై.యఫ్.ఐ,యస్.యఫ్.ఐ చేస్తున్న సేవలకు,కృషికి పలువురు అభినందనలు వెల్లువ.

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

నిత్యం విద్యార్థుల, యువకుల,ప్రజా సమస్యలపై పోరాటాలతో పాటు ప్రజాసేవ కార్యక్రమాలలో డి.వై.యఫ్.ఐ, యస్.యఫ్.ఐ కార్యకర్తలు ముందుంటారని,భవిష్యత్ లో ఇంకా పేద ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని డి.వై.యఫ్.ఐ రాష్ట్ర కమటీ సభ్యులు చింతల.రమేష్ తెలిపారు. స్థానిక మండల పరిధిలోని చిమ్మపుడి గ్రామంలో చాపల. సైదులు, కణతాల. సతీష్ వికలాంగులకు డి.వై.యఫ్.ఐ, యస్.యఫ్.ఐ సహకారంతో పూర్తిగా బాధ్యత తీసుకొని ఆన్లైన్ చేయించి, అధికారులతో మాట్లాడి ప్రభుత్వం ఇస్తున ఉచిత డ్రై సైకిల్స్ ని పంపిణీ చేయడం జరిగింది. డి.వై.యఫ్.ఐ,యస్.యఫ్.ఐ చేస్తున్న సేవలకు,కృషికి గ్రామ ప్రజలు,పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలుపుతున్నారు.ఈ పంపిణీ కార్య్రమంలో చింతల. రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా పేద ప్రజలకు సేవ కార్యక్రమాలు నిర్వహించడంలో డి. వై.యఫ్.ఐ ముందుంటుందని, ఈప్పటికీ భగత్ సింగ్ బ్లడ్ డోనార్స్ క్లబ్ ద్వారా కొన్ని వేల మందికి రక్తదానం చేస్తున్నామని, ప్రతి సంవత్సరం క్రీడలు అనేక కార్యక్రాలను నిర్వహిస్తున్నమని ఆయన అన్నారు.

చిమ్మపుడి గ్రామంలో ఇంకా ముగ్గురు వికలాంగులు ఉన్నారని, వారి సర్టిఫికెట్స్ అన్ని లేకపోవడం, టెక్నికల్ సమస్యలు ఉండటం వల్ల వారికి రాలేదని,భవిష్యత్ లో మేమే బాధ్యత తీసుకొని మిగిలిన వారికి కూడా డ్రై సైకిల్స్,వీల్ చైర్స్ ఇపిస్తామని ఆయన తెలిపారు. భవిష్యత్ లో కూడా ఇంకా అనేక రకాల సేవ కార్యక్రమాలను రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తామని,యువకులు,విద్యార్థులు,ప్రజలు బాగస్వామ్యం కావాలని, మద్దతును తెలియజేయాలని ఆయన పిలుపునిచ్చారు. సమస్యలపై పోరాటాలతో పాటు పేద ప్రజలకు సేవ కార్యక్రమాలు నిర్వహించడంలో ముందుంటామని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో యస్.యఫ్.ఐ మండల నాయకుడు జోనెబోయిన. నవీన్,డి.వై.యఫ్.ఐ మండల నాయకులు దొంతు. గణేష్, గ్రామ నాయకులు తెల్లబో కుదురుపాక. సాయి కృష్ణ, పోతురాజు.వేణు, చాపల.వీరబాబు, శెట్టి. నరేష్, సంపత్, చంద్రకాని.మహేష్, అల్లం.కరుణాకర్, కాముని.అరవింద్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page