ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా చిలకలూరిపేట లోని అన్ని అర్బన్ హెల్త్ సెంటర్స్ లోను మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా మలేరియా అధికారి ఆదేశానుసారం ర్యాలీలు మరియు అవగాహన కార్యక్రమంలో నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా నేను నా కుటుంబం నా సమాజం ఆరోగ్య రక్షణ కోసం దోమల నివారణ చర్యలు క్రమం తప్పకుండా పాటిస్తానని నా ఇల్లు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతానని దోమలు అభివృద్ధి చెందే ప్రదేశాలను పూర్తిగా తొలగిస్తానని ప్రతి శుక్రవారం గ్రేడ్ ఫ్రైడే పాటిస్తానని దోమల ద్వారా వచ్చు చికున్ గున్యా, మెదడువాపు, ఫైలేరియా మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకొని ఇతరులకు అవగాహన కల్పిస్తా నని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట పట్టణ మలేరియా సబ్ యూనిట్ అధికారి నారాయణ భూపతి హెల్త్ సూపర్వైజర్లు ఆరోగ్య కార్యకర్తలు ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
