పెదవడ్లపూడి గ్రామంలో ముగ్గురికి 1,99,490/- సీఎంఅర్ఎఫ్ చెక్కుల పంపిణీ

Sakshitha news

పెదవడ్లపూడి గ్రామంలో ముగ్గురికి 1,99,490/- సీఎంఅర్ఎఫ్ చెక్కుల పంపిణీ
….

సాక్షిత : ఐటీ విద్యా శాఖా మంత్రి స్థానిక శాసనసభ్యులు నారా లోకేష్ ఆదేశాల మేరకు

బాధితుల ఇంటికి వెళ్లి చెక్కులు పంపిణీ చేసిన టిడిపి నాయకులు

ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను సోమవారం టిడిపి నాయకులు బాధితుల ఇంటికి వెళ్లి అందజేశారు. మంగళగిరి మండలం పెద్దవడ్లపూడి గ్రామంలో లామ్ ప్రసాద్ కి రూ 1,01,208 వేల చెక్కును, మోర్ల విజయలక్ష్మి కి రూ 46,150 విలువైన చెక్కును, గోనుగుంట్ల శ్రీహరి రావు (లేటు) 52,132/- వేల సీఎంఆర్ఎఫ్ చెక్కులను, మొత్తం ముగ్గురికి 1,99,490/- రూ విలువైన చెక్కులను మంగళగిరి వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ జవ్వాది కిరణ్ చంద్ చేతుల మీద గా అందజేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెక్కులు రావడానికి కృషిచేసిన మంత్రి నారా లోకేష్ కు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.ఈకార్యక్రమం లో గ్రామ పార్టీ అధ్యక్షులు యేళ్ళ శివరామయ్య, మాదల రమేష్ బాబు, చిట్టిబొమ్మ వెంకటేశ్వరరావు, చింతల ఏడుకొండలు, జాలాది సందీప్, మొద్దుకురి రమేష్,కంచర్ల బద్రి, శానం రఘు, గుడిమెట్ల ఎల్లయ్య, కోట అరుణ్ దత్ తదితరులు పాల్గొన్నారు…