ఇస్రో శాస్త్రవేత్తగా ఎంపికైన సుధీర్ ను సన్మానించిన…………… మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

Sakshitha news

ఇస్రో శాస్త్రవేత్తగా ఎంపికైన సుధీర్ ను సన్మానించిన…………… మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

సాక్షిత వనపర్తి :

   వనపర్తి మున్సిపాలిటీ    మాజీ కౌన్సిలర్ పెండెం.నాగన్న యాదవ్  కుమారుడు పెండెం.సుధీర్ కుమార్ ఇటీవల ఇస్రో(భారత అంతరిక్ష పరిశోధన సంస్థ) నిర్వహించిన పోటీ పరీక్షలలో జాతీయ స్థాయిలో 51వ ర్యాంక్ సాధించి శాస్త్రవేత్తగా ఎంపికైన సందర్భంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి  ఘనంగా సన్మానించి అభినందించారు.
      ఈ సందర్భంగా ఆయన మాజీ మంత్రి  ముందుతరం యువత దీక్ష,దక్షత,పట్టుదలతో కష్టపడితే వివిధ రంగాలలో అద్భుతాలు సృష్టిస్తారు అని గతములో కేంద్ర సర్వీసులలో చూస్తే ఎక్కువ కేరళ,తమిళనాడు,బీహార్ ప్రాంతాల విద్యార్థులు విజయం సాధించేవారని,
     నేడు పరిస్థితి చూస్తే దశాబ్ద కాలంగా తెలంగాణలో కేంద్ర సర్వీసులలో యువత ప్రతిభ కనపరుస్తూ ఉన్నత ఉద్యోగాలు సాధిస్తున్నారని దీనికి కారణం తెలంగాణలో సుస్థిర ఆర్థిక ప్రగతి సాధించడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నత చదువులకు ప్రోత్సహిస్తున్నారని అంతే స్థాయిలో ప్రభుత్వ ప్రోత్సాహించడం కూడా శుభపరిణామమని అన్నారు.
     సుధీర్ మరింత ఉన్నతస్థాయికి ఎదిగి సమాజానికి ఉపయోగపడే కొత్త కొత్త సాంకేతిక పరిజ్ఞానం అందించాలని కోరారు.
       ఈ సందర్భంగా సుదీర్ కుమార్ తల్లితండ్రులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
   ఈ కార్యక్రమములో గట్టు యాదవ్,పలుస. రమేష్ గౌడ్,నందిమల్ల.అశోక్,కె.మాణిక్యం,రఘువర్ధన్ రెడ్డి,మాజీ కౌన్సిలర్స్ ఉంగ్లం.తిరుమల్,కంచ.రవి,మహేశ్వర్ రెడ్డి ,జోహెబ్ హుస్సేన్,చిట్యాల.రాము,మల్లికార్జున స్వామి,పెండెం.శ్రీనివాసులు,వెంకటస్వామి,తోట.శ్రీను తదితరులు పాల్గొన్నారు.