అకాల వర్షాల కారణంగా పెద్దమందడి మండలం లో కూలిన ఇండ్ల ను పరిశీలించిన……………….
రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి
సాక్షిత వనపర్తి :
వనపర్తి జిల్లాలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు కురవడంతో పెద్దమందడి మండలం లో జంగమయ్య పల్లె గ్రామానికి చెందిన బోయ అంజయ్య, దొడగుంటపల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సాయి భార్గవి రాజశేఖర్ శెట్టి, మోజర్ల గ్రామంలో పెద్దమందడి మండల్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు గట్టు దయాకర్ వారి ఇల్లు కూలిపోయిన విషయం గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకుల ద్వారా తెలుసుకొని కూలిన ఇండ్లను రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డిబుధవారం పరిశీలించారు. అనంతరం చిన్నారెడ్డి మాట్లాడుతూ
ఇల్లు కూలిన కుటుంబ సభ్యులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడం అదృష్టం అని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టిందని ఇల్లు కూలిన బోయ అంజయ్య, సాయి భార్గవి రాజశేఖర్ శెట్టి, గట్టు దయాకర్ వారికు ఇందిరమ్మ గృహ పథకం ద్వారా ఇండ్ల ఇచ్చి ఆదుకుంటామని తెలిపారు.
జిల్లా కలెక్టర్ తో,ప్రభుత్వ రెవిన్యూ అధికారులతో మాట్లాడి ప్రభుత్వం తరఫున రావాల్సిన సహాయని ఇండ్లు కూలిన వారికి అందజేయాలని సూచించారు.
పెద్దమందడి మండల్ ఎంపీడీవోతో మాట్లాడి
శిథీల అవస్థలో ఉన్న ఇండ్లకు , నిజమైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని సూచించారు.
కార్యక్రమంలో టీపీసిసి ప్రధాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య, వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ యాదవ్, పెద్దమండది బీసీ సెల్ అధ్యక్షుడు రఘు, సీనియర్ నాయకులు బాల్ చందర్, రాఘవేంద్ర రెడ్డి, సోషల్ మీడియా కోఆర్డినేటర్ గట్టు రాజు తదితరులు పాల్గొన్నారు.
