దుర్గమ్మను దర్శించుకున్న (NTR) జిల్లా ప్రస్తుత కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ డాక్టర్ జి. లక్ష్మీశ (Dr. G. Lakshmisha, IAS)
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ (NTR) జిల్లా ప్రస్తుత కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ డాక్టర్ జి. లక్ష్మీశ (Dr. G. Lakshmisha, IAS) ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా కలెక్టర్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి (E.O) సీనానాయక్ మరియు స్పెషల్ గ్రేడ్ డెప్యూటీ కలెక్టర్ తో కలిసి ఆలయ అభివృద్ధి పనులపై ఆరా తీసారు. భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు, జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ స్థానాచార్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
