ఘనంగా గంగమ్మగుడి చైర్మన్ జన్మదిన వేడుక
** శుభాకాంక్షలు చెప్పిన బీజేపీనేత గుండాల గోపి
…..
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: తిరుపతి గ్రామ దేవతగా నిత్య పూజలు అందుకుంటున్న శ్రీ తాతయ్య గుంట గంగమ్మ దేవస్థానం చైర్మన్ మహేష్ యాదవ్ జన్మదిన వేడుక బుధవారం ఘనంగా జరిగింది. ఆయనకు బీజేపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గుండాల గోపినాథ్ రెడ్డి, ఆలయ మాజీ చైర్మన్ ఆర్.సి.మునికృష్ణలు పుష్ప గుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కలియుగ వేంకటేశ్వర స్వామివారి దివ్య ఆశీస్సులతో మహేష్ యాదవ్ మరెన్నో జన్మదినాలు సంపూర్ణ ఆరోగ్యంగా జరుపుకోవాలని కోరుతూ జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. వారిలో రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథ్, పురోహితుడు సురేష్ స్వామి, అన్నారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, తొండము నాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, రవిశంకర్ యాదవ్, హరినాథ్, తమ్మిశెట్టి చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
