త్వరలో శెట్టిపల్లి లేఔట్ పనులు ప్రారంభం
** “తుడ” ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి వెల్లడి
…..
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: అనుకున్న సమయానికి శెట్టిపల్లి భూముల్లో కొనుగోలుదారు లకు, రైతులకు పట్టాలను పంపిణీ చేయడం జరుగుతుందని “తుడ” చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి వెల్లడించారు. శెట్టిపల్లి భూముల లేఔట్ ఏర్పాటు, పట్టాలు పంపిణీ తదితర అంశాలపై తుడా కార్యాలయంలో తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి అధ్యక్షతన తిరుపతి ఆర్డీవో రామ్మోహన్, తుడా లోని అన్ని విభాగాల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే శెట్టిపల్లి భూముల ఫ్లాట్స్ కొనుగోలుదారులకు, రైతులకు పట్టాలను పంపిణీ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. లేఅవుట్ ప్లానింగ్, మౌలిక వసతుల కల్పనపై అధికారులతో సమీక్ష చేయడం జరిగిందన్నారు. రెవెన్యూ అధికారులతో మాట్లాడి పట్టాలను సిద్ధం చేస్తున్నామని వివరించారు.
వీలైనంత త్వరలో పట్టాలు పంపిణీకి సిద్ధం అవుతున్నామని, అపోహలు వీడి ప్లాట్స్ కొనుగోలుదారులు, రైతులు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న శెట్టిపల్లి భూముల పరిష్కారానికి చొరవ చూపిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి, యువ నాయకులు… మంత్రి నారా లోకేష్ లకు ఎప్పటికీ రుణపడి ఉండాలని ప్రజలను కోరారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
