SAKSHITHA NEWS

WhatsApp Image 2023 08 11 at 5.03.01 PM

బీసీబందు, ముస్లింబందు, గృహలక్ష్మి పథకం

ప్రెస్ నోట్ విడుదల చేస్తున్న పాల్వంచ రామారావు తో పాటు జేఏసీ నేతలు

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

కెసిఆర్ గత హామీలన్నీ మర్చిపోవటానికి పెట్టిన స్కీములు ఎన్నికల జిమ్మిక్కులని మండిపడ్డారు మొదటిసారి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తాఅన్నాడు, తరువాత ఇంటిజాగాలు ఉన్నోళ్ళకి 5 లక్షల స్కీమ్ అన్నాడు మూడు నెలల్లో దిగిపోయే ప్రభుత్వం గృహలక్ష్మి ఇంటికి మూడు లక్షల స్కీమ్ ఆశపెడితే ఇవి పచ్చి మోసాలని తెలవక అమాయకంగా ప్రజలు ధ్రువపత్రాల కొరకు ఉరుకులు పరుగులు పెడుతుంటే కడుపు తర్కపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు

పదిమంది లబ్ధిదారులకిచ్చి పదివేల మందికి ఇచ్చినట్టుగా భజన పత్రికల్లో టీవీలలో అబద్ధాలు ప్రచారం చేసుకోవడం ఘోరమైన అన్యాయం అన్నారు పది సంవత్సరాలుగా పేదలకు ఒక్కరేషన్ కార్డు కూడా ఇవ్వలేని కెసిఆర్ ఎన్నికల జిమ్మిక్కుస్కీములకు డబ్బు ఎక్కడుందని నిలదీశారు మిగులు బడ్జెట్ గా ఉన్న ధనిక రాష్ట్ర సంపాదనంతా లూటీచేసి హైదరాబాదులో అత్యంత ఖరీదైన 70 వేల కోట్ల రూపాయల భూములను తెగ నమ్ముకొని ఇంకా ఆరు లక్షలకోట్ల అప్పుచేసి రాబోవు మూడుతరాల తెలంగాణ ప్రజల భవిష్యత్తును సర్వనాశనంచేసి రాబోయే రెండు సంవత్సరాల బ్రాందీ షాపుల ఆదాయంపై ముందే కన్నేసి టెండర్లు పిలిచి ప్రజల రక్తం పిండి సొమ్ము చేసుకుంటిరికదా ఫండ్స్ లేకుండానే ఉత్తుత్తి వర్క్ పర్మిషన్లు కొత్త కొత్త హామీలకు ఉత్తుత్తి జీవోలు ఉత్తిత్తి శాంక్షన్ ఆర్డర్ కాగితాలు చూపించి పాలాభిషేకాలు చేసుకుంటుంటూ పేద ప్రజల్ని ఇంతమోసం చేస్తుంటే ప్రతిపక్షాలు ఎందుకు మాట్లాడటం లేదని సూటిగా ప్రశ్నించారు

ప్రతినెల ప్రజల సొమ్ముతో లక్షలాది రూపాయలు జీతాలు తీసుకునే జిల్లామంత్రి పార్లమెంటు ఫ్లోర్ లీడర్ సీఎల్పీ లీడర్ తో పాటు అధికార ప్రతిపక్ష ప్రజా ప్రతినిధులు మా జేఏసీ రిటైర్డ్ గెజిటెడ్ ఆఫీసర్ల బృందంతో బహిరంగ చర్చకు వచ్చి పేద ప్రజలకు మీరేమి న్యాయం చేశారు చెప్పాలని డిమాండ్ చేశారు పాల్వంచ రామారావు తోపాటు డాక్టర్ బివి రాఘవులు టివి రాజు డాక్టర్ కైజర్ అహ్మద్ ఎంఏ రెహమాన్ కె.నాగచారి గుండ్లపల్లి శ్రీనివాస్ డాక్టర్ హైమావతి ఉరిమిళ షేక్ జబీనా తోపాటు అనేకమంది పాల్గొని ప్రభుత్వ తీరును ఎండగట్టారు


SAKSHITHA NEWS