SAKSHITHA NEWS

WhatsApp Image 2023 07 26 at 4.49.31 PM

అన్ని శాఖల యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి.. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు.. నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే విజ్ఞప్తి..


సాక్షిత : నగరంలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించిన నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న అధికారులు సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ ఆదేశించారు.

నగర వ్యాప్తంగా రానున్న 24 గంటలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ రెడ్ అల్డర్ ప్రకటించడంతో ఎంత వర్షం కురిసినా ప్రజలు ఏలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి.

ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ ఇరిగేషన్, వాటర్ వర్క్స్ మరియు మున్సిపల్ శాఖ అధికారులతో కలిసి ౧౩౦-సుభాష్ నగర్ డివిజన్ పరిధిలోని ఫాక్స్ సాగర్ చెరువు ముంపు ప్రాంతాలను సందర్శించారు..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ లోతట్టు ప్రాంతాల్లో నివాసితులు ఎలాంటి ఇబ్బంది లేకుండా నీరు నిలవకుండ జాగ్రత్తలు తీసుకోవాలని, యంత్రాంగం కూడ బృందాలుగా ఏర్పాటు చేసుకుని మరింత అప్రమత్తంగా ఉంటూ రోడ్డు పై నిలిచిన నీరును వెనువెంటనే తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యవసరం ఉంటే తప్ప ఇంటి నుంచి బయటికి రావద్దని ఎమ్మెల్యే కోరారు.

వర్షం భారీగా కురుస్తున్నందున ఫాక్స్ సాగర్ చెరువు తూమును దశలవారీగా విడుదల చేయాలని, పైప్లైన్ రోడ్డులోని హార్టికల్చర్ నర్సరీలో ఉన్నటువంటి కాలువల పూడిక తీసి వరద నీరు సాఫీగా పోయేలా చూడాలని, అలాగే 1500 ఎం.ఎం డయాతో నిర్మిస్తున్న నాలా పనులు యుద్దప్రాతిపాదికన కింద పూర్తి చేయాలని, బి.హెచ్,ఈ.ఎల్. విస్టా కాలనీలో నిర్మిస్తున్న చైన్ నాలా పనులు త్వరగా పూర్తి చేసి మెయిన్ నాలకు అనుసంధామ్ చేయాలని, దీని వల్ల వరద నీరు ఎక్కడ ఆటంకం లేకుండ ప్రవహిస్తాయని, మరియు శ్వేతా ఆర్యన్ వద్ద పగిలిపోయిన పైపులైను వ్యవస్థను మరమ్మతులు చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఎమ్మెల్యే సంభంధిత అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఎస్.ఈ. చిన్నా రెడ్డి, జి.ఎం. శ్రీధర్ రెడ్డి, డి.జి.ఎం రాజేష్, మేనేజర్ రాజు, డి.ఈ.ఈ. భాను, డి.ఈ.ఈ. నరేందర్, ఏ.ఈ. రామారావు, ఏ.ఈ. సురేందర్ నాయక్, డివిజన్ అధ్యక్షులు స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS