ఓపెన్ స్కూల్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేయాలి.
మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అధికారుల సమీక్షకు నివేదికలు సిద్ధం చేయాలి.
సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి: ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాలకు చెందిన 149 మంది దరఖాస్తు చేసుకున్నారని కలెక్టర్ తెలిపారు. ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. భూ సమస్యలకు 45 తాసిల్దార్లకు 16 ఆర్డీవో 7 దరఖాస్తులు,మున్సిపల్ కమిషనర్లకు 7 దరఖాస్తులు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారికి 11 దరఖాస్తులు, జిల్లా పంచాయతీరాజ్ అధికారికి 12 దరఖాస్తులు, పీడీ మెప్మా 8 దరఖాస్తులు,ఇతర శాఖలకు 43 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ తెలిపారు. సంబంధించిన అధికారులు దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించి త్వరగా పరిష్కరించాలని సూచించారు.
వచ్చేనెల 3-10-2024 నుండి 9-10-2024 తారీకు వరకు జరగనున్న ఓపెన్ స్కూల్ 10వ తరగతి intermedite పరీక్షలకు అన్ని ఏర్పాటు చేయాలని జిల్లాలో మొత్తం 355 మంది విద్యార్థులు పరీక్షలు హాజరవుతున్నారని కలెక్టర్ తెలిపారు. రేపు సాయంత్రం 6 గంటలకు రాష్ట్ర నీటిపారుదల శాఖ, పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి కలెక్టరేట్ నందు సమావేశం కలదు కావున కలెక్టరేట్ కార్యాలయంలో అన్ని ఏర్పాట్లు చేయాలని సమావేశానికి అధికారులందరూ తమ పూర్తి నివేదికను సిద్ధం చేసుకొని రావాలని కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిఎఫ్ఓ సతీష్ కుమార్ డి ఆర్ డి ఓ వీవి అప్పారావు సిపిఓ ఎల్ కిషన్ అన్ని శాఖలకు చెందిన అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.