నల్ల చట్టాలను రద్దుచేసి ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని ఏ ఐ టి యు సి, సిఐటియు ల ఆధ్వర్యంలో బ్లాక్ డే
*సాక్షిత వనపర్తి : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసి కార్మికుల హక్కులను ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాల పిలుపుమేరకు ఆర్టీసీ పెట్రోల్ బంకు ముందు ఏఐటియుసి సిఐటియు సంఘాల ఆధ్వర్యంలో బ్లాక్ డే ను నిర్వహించ ప్రభుత్వం నాలుగు కోడ్ల ప్రతులను దగ్ధం చేయడం జరిగింది ఈ సందర్భంగా కార్మిక సంఘాలనాయకులు పుట్ట ఆంజనేయులు, గోపాలకృష్ణ యాదవులు మాట్లాడుతూ కార్మికులు 1926 లోనే పోరాడి సాధించుకున్న 29 చట్టాలను కేంద్ర ప్రభుత్వం వాటిని రద్దుచేసి స్వదేశీ విదేశీ గుత్త కంపెనీలకు ధనవంతులకు అనుకూలమైన నాలుగు లేబర్ కోడ్లను తీసుకురావడం జరిగిందని వీటిని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్త సమ్మెలో నిర్వహించినప్పటికీ ప్రభుత్వానికి పట్టడం లేదని కేంద్రం తీసుకువచ్చిన నల్ల చట్టాలను బిజెపి పాలిత రాష్ట్రాల్లో అమల్లోకి వచ్చాయని కొన్ని రాష్ట్రాల్లో రూల్స్ కూడా రూపొందించ అమలు చేస్తున్నారని దీన్నిబట్టి కార్మికులను కట్టు బానిసలుగా చేసేందుకు చట్టాలను ప్రభుత్వం తీసుకొచ్చినట్లుగా కనిపిస్తోందని ఆగ్రహము వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక చట్టా లు రద్దు అయ్యేంతవరకు ఉద్యమించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు నందిమల్ల రాములు నాయకులు మద్దిలేటి సూరి గోవిందు నాగన్న దొరస్వామి అడిసన్న వీరయ్య లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు