SAKSHITHA NEWS

AIRPORT అమరావతి

అనంతపురంలో ఎయిర్ పోర్టు ఏర్పాటుపై రామ్మోహన్ నాయుడు స్పందన

ఎయిర్ పోర్టుకు 1,200 ఎకరాల భూమి అవసరమవుతుందన్న రామ్మోహన్ నాయుడు

భూమి చూపిస్తే విమానాశ్రయం ఏర్పాటుపై అధ్యయనం చేస్తామని వెల్లడి

ఎయిర్ పోర్ట్ కోసం ఇటీవల రామ్మోహన్ నాయుడుకి విన్నవించిన పయ్యావుల

ఏపీలో కొత్త ఎయిర్ పోర్టులను నిర్మించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. బెంగళూరుకు సమీపంలో ఉండే అనంతపురంను కూడా పరిశీలిస్తోంది. ఈ క్రమంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ… అనంతపురంలో అనువైన భూమి చూపిస్తే విమానాశ్రయం ఏర్పాటుపై అధ్యయనం చేస్తామని, తదుపరి కార్యాచరణ చేపడతామని చెప్పారు. విమానాశ్రయం ఏర్పాటు కోసం 1,200 ఎకరాల భూమి అవసరమవుతుందని అన్నారు. ఉద్యాన ఉత్పత్తుల ఎగుమతుల కోసం అనంతపురంలో ఎయిర్ పోర్టు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, జిల్లాకు చెందిన ఎంపీలు అంబికా లక్ష్మీనారాయణ, బీకే పార్థసారథి ఇటీవల చేసిన విన్నపంపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

AIRPORT

SAKSHITHA NEWS