పార్కింగ్ లేని చెన్నై షాపింగ్ మాల్ కు అనుమతులు ఎలా ఇచ్చారు ?
- షాపింగ్ మాల్ అనుమతులకు పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు అనుమానాలు.
- చెన్నై షాపింగ్ మాల్ వద్ద ఇరువైపులా రోడ్లపైనే పార్కింగ్ లు పట్టించుకోని పోలీస్, మున్సిపల్ యంత్రాంగం
- ఒక్క షాపింగ్ మాల్ కోసం ట్రాఫిక్ అంక్షలు, భారీ కేడ్ లు పెట్టి ఆర్టీసీ బస్ లు దారి మల్లింపు చేయడమా ?
- రోడ్ల మీద తోపుడు ఫ్రూట్స్ బండ్లు, మిర్చి బండ్లు, వేజీటేబుల్ బండ్లు ఉంటే తొలగించాలని వేదిస్తున్న అధికారులు, చెన్నైయ్ షాపినీ మాల్ కు ఊడిగం చేస్తున్న మున్సిపల్ యంత్రాంగం.
- రోడ్డు పక్కన టూ వీలర్స్, కార్లు ఆపి ఉంటే ఫోటోలు తీసి ఫైన్ వేస్తున్న ట్రాఫిక్ యంత్రాంగం
- ట్రాఫిక్ తో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న చెన్నై షాపింగ్ మాల్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.
- ట్రాఫిక్ సమస్య పరిస్కారం కాకుంటే మున్సిపల్, చెన్నైయ్ షాపింగ్ మాల్ ముందు ఆందోళన చేస్తామని హెచ్చరిక
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో పత్రిక విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు కోమటిరెడ్డి తేజ్ దీప్ రెడ్డి, బండారి శేఖర్ లు మాట్లాడుతూ కరీంనగర్ నగరంలో చెన్నై షాపింగ్ మాల్ కు పార్కింగ్ స్థలం లేకుండా ప్రధాన రహదారి పక్కన ఏ రకంగా మున్సిపాలిటీ అనుమతిలిచ్చిందో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గత మూడు రోజుల నుండి కోర్టు నుండి బస్టాండు వెళదామంటే తీవ్రమైన ట్రాఫిక్ తో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
మున్సిపల్, పోలీస్ యంత్రాంగం బరికేడ్ లు పెట్టి ఆర్టీసీ బస్సులను దారి మళ్ళించడం ఏమిటని ప్రశ్నించారు. జిల్లా మంత్రి గారి కృషితో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కు స్మార్ట్ సిటీ హోదా రావడంతో కరీంనగర్ కు పెద్ద ఎత్తున షాపింగ్ మాల్ లు ఇతర షాప్ లు వస్తున్నాయి. కానీ నగరపాలక సంస్థ వ్యవహారం మూలంగా మంత్రికి చెడ్డపేరు తెస్తున్నారని ఆరోపించారు. అంత పెద్ద షాపింగ్ మాల్ కు నిర్మాణం అనుమతులు ఇచ్చే ముందు పార్కింగ్ స్థలం ఉన్నదా లేదా ఒక్కవేల ఉంటే అది సరిపోతుందా లేదా కనీసం పరిశీలిన చేయకుండా అనుమతులు ఎలా ఇచ్చారాని ప్రశ్నించారు. ప్రభుత్వ యంత్రాంగం ఒక్క చెన్నైయ్ షాపింగ్ మాల్ కోసం ఊడిగం చేయడం ఏమిటని ప్రశ్నించారు.
షాపింగ్ కోసం వస్తున్న వినియోదారులకు సరైన పార్కింగ్ ఏర్పాట్లు లేకపోవడంతో వినియోగదారులు వాహనాలను రోడ్లపైనే ఇరువైపులా పార్కింగ్ లు చేస్తున్నారని అన్నారు. దీనితో ఇతర వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. చెన్నైయ్ షాపింగ్ మాల్ కు పార్కింగ్ లేకుండా ఏవిధంగా మున్సిపాలిటీ అనుమతులు ఇచ్చిందని ప్రశ్నించారు. చెన్నైయ్ షాపింగ్ మాల్ నిర్మాణం అనుమతుల కోసం పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు అనుమానాలు కలుగుతున్నాయని ఆరోపించారు. చెన్నైయ్ షాపింగ్ మాల్ నిర్మాణం అనుమతులపై సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ చేశారు.ఒక్క షాపింగ్ మాల్ కోసం ట్రాఫిక్ అంక్షలు పెట్టడం, భారీ కేడ్ లు పెట్టి ఆర్టీసీ బస్ లు దారి మళ్లించడం ఏమిటని ప్రశ్నించారు. జీవన ఉపాధి కోసం రోడ్ల మీద స్ట్రీట్ వెండర్ లు తోపుడు బండ్లు ఫ్రూట్స్ , మిర్చి బండ్లు, వేజీటేబుల్ ఉంటే వారిని వేదిస్తూ వాటిని తొలగిస్తున్న అధికారులు, వెంకటేశ్వర టెంపుల్ వద్ద కూరగాయలు అమ్ముకుంటున్న మహిళలను మీరు రోడ్ల మీద పెట్టి అమ్ముతున్నారని పోలీస్ లు, మున్సిపల్ అధికారులు వేదిస్తున్నారు కానీ చెన్నయ్య్ షాపింగ్ మాల్ కోసం మాత్రం ప్రభుత్వ యంత్రాంగం ఊడిగం చేయడం నీచమని అన్నారు.
రోడ్లమీద టూ వీలర్స్, కార్లు ఆపి ఉంటే ఫోటోలు తీసి ఫైన్ వేస్తున్న ట్రాఫిక్ యంత్రాంగం మరి ఎలాంటి పార్కింగ్ లేకుండా వినియోగదారులను వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న చెన్నై షాపింగ్ మాల్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో ప్రజలకు తెలపాలని డిమాండ్ చేశారు. పోలీస్ యంత్రాంగం, మున్సిపల్ యంత్రాంగం కార్పొరేట్స్, ధనవంతులకు అనుకూలంగా ఉంటూ పేదలను వాహదరులను వేదించడం ఎంతవరకు సరైందో చెప్పాలని డిమాండ్ చేశారు.ట్రాఫిక్ సమస్య పరిస్కారం కాకుంటే మున్సిపల్, చెన్నైయ్ షాపింగ్ మాల్ ముందు ఆందోళన చేస్తామని హెచ్చరిక చేసారు.
ఈ సమావేశంలో అల్ ఇండియ ఫార్వర్డ్ బ్లాక్ నగర అధ్యక్షులు సత్యారావు , కార్యదర్శి వాషిమ్ హై్మద్, చొప్పదండి ఏమ్మెల్యే అభ్యర్థి విజయ్ కుమార్, జిల్లా కమిటీ సభ్యులు ప్రశాంత్ కుమార్, పులిమతి సంతోష్, యూత్ లీగ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె. బద్రినేత నాయకులు హరీష్ , రాజు ,సల్మాన్ , అరవింద్ పాల్గొన్నారు.